ఏపీ సీఎం జగన్, మంత్రి గౌతం రెడ్డిపై ఏపీఐఐసీ చైర్మన్ రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ బాహుబలి లాంటి వారని, మంత్రి గౌతంరెడ్డి సైరా నరసింహారెడ్డి లాంటి వ్యక్తిని అని రోజా అన్నారు. వీరిద్దరూ కూడా పెద్ద పారిశ్రామివేత్తలే అని వ్యాఖ్యానించిన రోజా... వీరిద్దరూ కలిసి రాష్ట్రానికి మంచి పారిశ్రామిక పాలసీలు తీసుకువస్తారని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొన్న రోజా... నిర్ణీత సమయంలో పారిశ్రామిక వేత్తలకు అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు. పైసా లంచం ఇవ్వకుండా అనుమతులు ఇవ్వాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు.
స్థానికుల ఉద్యోగాల విషయమై ప్రతి చోట ఫిర్యాదులు వస్తున్నాయని.... దీనిపై పారిశ్రామిక వేత్తలు స్పందించాలని రోజా అన్నారు. తాము అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాక ముందే పరిశ్రమలు తరలి పోతున్నాయని అరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు. పరిశ్రమలకి గత ప్రభుత్వం అధిక రాయితీలు ఇచ్చిందని రోజా వివరించారు. గత ప్రభుత్వ పెద్దలు ఒక్కో పరిశ్రమకు ఒక్కో రకమైన పాలసీ ఇచ్చి రాష్ట ఖజానకు గండి కొట్టారని ఆరోపించారు. ప్రతి మూడు నెలలకి ఓసారి పారిశ్రామికవేత్తలని కలిసి సమస్యలు తెలుసుకుంటామని... ఈ రకంగా ముందుకు సాగుతామని రోజా అన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.