రాజధాని బిల్లు ఆమోదం పొందింది... బాంబ్ పేల్చిన రోజా

14 రోజుల్లోపు సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు చేయకపోవడంతో రాజధాని బిల్లు ఆమోదం పొందినట్లే అని APIIC చైర్‌పర్సన్ రోజా స్పష్టం చేశారు.

news18-telugu
Updated: February 12, 2020, 12:13 PM IST
రాజధాని బిల్లు ఆమోదం పొందింది... బాంబ్ పేల్చిన రోజా
రోజా
  • Share this:
ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ జగన్ సర్కార్ రూపొందించిన రాజధాని బిల్లుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. 14 రోజుల్లోపు సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు చేయకపోవడంతో రాజధాని బిల్లు ఆమోదం పొందినట్లే అని APIIC చైర్‌పర్సన్ రోజా స్పష్టం చేశారు.  బుధవారం తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు.  ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానులను వ్యతిరేకించిన చంద్రబాబును రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు తరిమికొట్టాలన్నారు. చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర చేయడం సిగ్గుమాలిన చర్య అన్నారు. ప్రజలు చైతన్యవంతులే కాబట్టి లోకేష్‌ని  మంగళగిరిలో ఓడించారన్నారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ కోసం పనిచేస్తుంటే..జగన్‌ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు రోజా. లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తోన్న సోషల్‌ మీడియా దుష్ప్రచారంపై ఫిర్యాదు చేస్తే 80 శాతం టీడీపీ నేతలు జైల్లో ఉంటారని రోజా హెచ్చరించారు.

సెలెక్ట్‌ కమిటీ ఫైల్‌ని శాసనమండలి కార్యాలయం వెనక్కి పంపింది. దీంతో మళ్లీ శానసమండలి చైర్మన్‌ వద్దకు ఫైలు చేరింది. రూల్‌ 154 కింద కమిటీ వేయడం చెల్లదని ఫైలు మీద రాసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే శాసనమండలి కార్యదర్శిని టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్‌ పక్షాలు కలిశాయి. రూల్‌ 154 కింద చైర్మన్‌ ప్రకటన ఉంటుందని, ఆ ప్రకటనకు అనుగుణంగానే కమిటీ వేయాల్సి ఉంటుందని విపక్షాలు వాదిస్తున్నాయి.

First published: February 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు