పల్నాడులో పరిస్థితిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా కీలక వ్యాఖ్యలు

యరపతినేని, కోడెల లాంటావారి నుంచి విముక్తి పొందామని గుంటూరు జిల్లా ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు రోజా.

news18-telugu
Updated: September 14, 2019, 8:30 AM IST
పల్నాడులో పరిస్థితిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా కీలక వ్యాఖ్యలు
వైసీపీ ఎమ్మెల్యే రోజా (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: September 14, 2019, 8:30 AM IST
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా. ఈ సందర్భంగా మీడిమాతో మాట్లాడిన ఆమె... ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సీఎం జగన్ వంద రోజుల పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.ప్రజల్లో జగన్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్నారు రోజా. పెయిడ్ ఆర్టిస్టుల్ని తీసుకొచ్చి సీఎం జగన్‌పై బురద జల్లుతున్నారని మండిపడ్డారు.
పల్నాడులో అరాచకాలు జరుగుతున్నాయని నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. యరపతినేని, కోడెల లాంటావారి నుంచి విముక్తి పొందామని గుంటూరు జిల్లా ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు రోజా. ఇకనైనా నాటకాలు ఆపకపోతే ప్రజలు తరిమికొడతారన్నారు.

First published: September 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...