చంద్రబాబు అమరావతి టూర్... అందుకే అన్న రోజా

అమరావతిలో అవినీతి సామ్రాజ్యం నిర్మించాలని చంద్రబాబు అనుకున్నారని రోజా ఆరోపించారు.

news18-telugu
Updated: November 28, 2019, 4:09 PM IST
చంద్రబాబు అమరావతి టూర్... అందుకే అన్న రోజా
రోజా, చంద్రబాబు నాయుడు(File)
  • Share this:
చంద్రబాబు అమరావతి పర్యటనపై వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన బినామీ ఆస్తులు ఎలా ఉన్నాయో చూసుకోవడానికే చంద్రబాబు అమరావతి పర్యటన చేశారని ఆమె ఆరోపించారు. అమరావతిలో చంద్రబాబు ఒక్క శాశ్వత కట్టడం కూడా నిర్మించలేదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తన అనుకూల మీడియా ద్వారా చంద్రబాబు అమరావతిపై ప్రజలకు భ్రమలు కల్పించారని రోజా ధ్వజమెత్తారు. తన బినామీల పేరు మీద తీసుకున్న ఆస్తుల సరిహద్దులు సరిగ్గా ఉన్నాయా లేదా అని చూడటానికి చంద్రబాబు అమరావతిలో పర్యటించారని మండిపడ్డారు.

అమరావతిలో అవినీతి సామ్రాజ్యం నిర్మించాలని చంద్రబాబు అనుకున్నారని రోజా ఆరోపించారు. 30 వేల ఎకరాల రైతుల నుంచి తీసుకున్న గత ప్రభుత్వం... వారికి ఏ మాత్రం న్యాయం చేయలేదని అన్నారు. అమరావతి ప్రాంతం ఉన్న ప్రాంతంలోనూ వైసీపీ గెలిచిందంటేనే... అక్కడి ప్రజలు టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారనే విషయం తేలిపోయిందని అన్నారు. చంద్రబాబుకు ఏ అంశం లేక తాజాగా అమరావతి అంశాన్ని లేవనెత్తారని రోజా మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారని... చంద్రబాబు ఇలాగే వ్యవహరిస్తే ఆయనకు పుట్టగతులుండవని రోజా విమర్శించారు.

Published by: Kishore Akkaladevi
First published: November 28, 2019, 4:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading