అచ్చెన్నాయుడు తరువాత చంద్రబాబే... రోజా కీలక వ్యాఖ్యలు

తప్పు చేసిన వ్యక్తి బీసీ అయినా ఓసీ అయినా... చట్టం ముందు అంతా సమానమే వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. లోకేశ్ మాటలకు విలువ లేదని... ప్రజల్లో గెలవలేని వ్యక్తి చెప్పే మాటలు ఎవరూ పట్టించుకోరని ఆమె అన్నారు.

news18-telugu
Updated: June 12, 2020, 12:32 PM IST
అచ్చెన్నాయుడు తరువాత చంద్రబాబే... రోజా కీలక వ్యాఖ్యలు
జబర్దస్త్‌లో నటించడం తమ నాయకుడికి తెలుసని.. తాను పూర్తిస్థాయి రాజకీయ నాయకురాలిగా మారితే అవన్నీ వదిలేస్తానని చెప్పింది. జబర్దస్త్ వల్ల తనకు ఉండే క్రేజ్ అలా కంటిన్యూ అవుతుందనే బాధతో మాట్లాడుతున్నారని.. అది మంచి కామెడీ షో మాత్రమే అని దాని వల్ల చాలా మంది ఆరోగ్యం కూడా బాగు పడుతుందని చెప్పుకొచ్చింది రోజా.
  • Share this:
తప్పు చేశారే కాబట్టే మాజీమంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్ట్ చేసిందని వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా అన్నారు. అధికారం కోల్పోయినప్పటి నుంచి చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థంకావడం లేదని రోజా విమర్శించారు. తప్పు చేసిన వ్యక్తి బీసీ అయినా ఓసీ అయినా... చట్టం ముందు అంతా సమానమే అని వ్యాఖ్యానించారు. లోకేశ్ మాటలకు విలువ లేదని... ప్రజల్లో గెలవలేని వ్యక్తి చెప్పే మాటలు ఎవరూ పట్టించుకోరని ఆమె అన్నారు. తాము తప్పు చేస్తే అరెస్ట్ చేసుకోవచ్చని గతంలో తొడగొట్టిన లోకేశ్... సాక్ష్యాలతో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే ఎందుకు మండిపడుతున్నాడని విమర్శించారు. ప్రస్తుతం అచ్చెన్నాయుడి అవినీతితో దొరికిపోయాడని... ఫైబర్ గ్రిడ్, చంద్రన్న కానుకల్లో జరిగిన అవినీతితో చంద్రబాబు కూడా జైలుకు వెళ్లడం ఖాయమని రోజా వ్యాఖ్యానించారు. పేద కార్మికుల వైద్యానికి కేటాయించిన డబ్బును అచ్చెన్నాయుడు దోచుకున్నారని ఆమె మండిపడ్డారు. తప్పు చేసి వివరణ ఇస్తే సరిపోదని రోజా అన్నారు. తప్పు చేసిన వారు కచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: June 12, 2020, 12:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading