ఘనంగా రోజా బర్త్‌డే... ఫ్యామిలీతో కలిసి సెలబ్రేషన్స్

ఇప్పటివరకు రోజా పోస్టుకు ఆమె అభిమానులు 17వేలమంది విషెస్ చెబుతూ కామెంట్స్ చేశారు.

news18-telugu
Updated: November 17, 2019, 3:17 PM IST
ఘనంగా రోజా బర్త్‌డే... ఫ్యామిలీతో కలిసి సెలబ్రేషన్స్
ఇప్పటివరకు రోజా పోస్టుకు ఆమె అభిమానులు 17వేలమంది విషెస్ చెబుతూ కామెంట్స్ చేశారు.
  • Share this:
వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్, సెలబ్రిటీ రోజా తన పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించుకున్నారు. తన ఫ్యామిలీతో కలిసి ఆమె సంబరాలు జరుపుకున్నారు. కుటుంబసభ్యలు సమక్షంలో కేక్ కట్ చేసి ఆ ఫోటోల్ని తన సోషల్ మీడియా పేజీల్లో పోస్టు చేశారు. దీంతో ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటివరకు రోజా పోస్టుకు ఆమె అభిమానులు 17వేలమంది విషెస్ చెబుతూ కామెంట్స్ చేశారు. రోజా గారు ఇలా మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.


మరోవైపు తన బర్త్‌డే సందర్భంగా పలు కార్యక్రమాలు ప్రారంభించారు రోజా. నగరి నియోజకవర్గంలో ఆమె పలు సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. రోజా ఛారిటబుల్ ట్రస్ట్ తరపున పుత్తూరు పట్టణం 13వ వార్డులో వైయస్సార్ స్వఛ్చనీరు..రూ. 2కే 20 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందించే RO మినరల్ వాటర్ ప్యూరిఫైయర్ ను ఆమె ప్రారంభించారు. దీంతో పాటు... ప్లాస్టిక్ రహిత నగరిని తయారు చేయాలనీ సంకల్పంతో.. జనపనార, గుడ్డతో తయారు చేసిన సంచులను అందించారు. డిసెంబర్ 21 నాటికి నగరి నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ నుంచి కాపాడాలని ఆమె కోరారు.

First published: November 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com