తాటతీస్తా.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే రోజా సీరియస్ వార్నింగ్

వారు పూలు చల్లుతారని తాను ఊహించలేదని.. ఐతే ప్రేమతో చేస్తున్న పనిని కాదనలేకపోయానని చెప్పారు. అందరూ సామాజిక దూరం పాటించారని స్పష్టం చేశారు రోజా.

news18-telugu
Updated: April 22, 2020, 4:34 PM IST
తాటతీస్తా.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే రోజా సీరియస్ వార్నింగ్
రోజా (Roja)
  • Share this:
లాక్‌డౌన్‌ను ఉల్లంఘించారంటూ ఎమ్మెల్యే రోజాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఓ బోరుబావి ప్రారంభ కార్యక్రమంలో.. స్థానికులు రోజాపై పూలుజల్లి ఘనస్వాగతం పలికిన ఘటనపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ క్రమంలో స్వయంగా ఎమ్మెల్యే రోజానే దీనిపై వివరణ ఇచ్చారు. నగరి నియోజకర్గంలోని సుందరయ్యనగర్ ప్రాంతంలో నీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. వైసీపీ అధికారంలోకి వచ్చాక వారికి నీళ్లు ఇచ్చామని తెలిపారు. వారు పూలు చల్లుతారని తాను ఊహించలేదని.. ఐతే ప్రేమతో చేస్తున్న పనిని కాదనలేకపోయానని చెప్పారు. అందరూ సామాజిక దూరం పాటించారని స్పష్టం చేశారు రోజా.

సుందరయ్య నగర్‌లో నీళ్లు, కరెంట్ లేక ప్రజలు కొన్నాళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వం వీరి కోసం ఏమీ చేయలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంత ప్రజలకు నీళ్లు ఇచ్చాం. బోరుబావి ప్రారంభానికి ఆహ్వానించడంతో నేను వెళ్లా. అయితే వారు పూలు చల్లుతారని ఊహించలేదు. ప్రేమతో చేస్తున్న పనికి ఇబ్బంది పెట్టకూడదని భావించా. దీనిపై విపక్ష నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు నేను భయపడబోను. సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే తాట తీస్తా.
రోజా, వైసీపీ ఎమ్మెల్యే


ఎమ్మెల్యే రోజా ఇటీవల సుందరయ్య నగర్‌లో ఓ బోరు బావి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఐతే రోజా నడుస్తుంటే.. రోడ్డుకు ఇరువైపులా జనాలు పూల జల్లుతూ స్వాగతం తెలిపారు. చిన్న పిల్లలు కూడా పూలు చల్లుతూ కనిపించారు. అలా జనం పూల వర్షం కురిపిస్తుంటే ఆ బాటలో నడుచుకుంటూ ముందుకెళ్లారు రోజా. అనంతరం గ్రామస్తులు భారీ పూల దండను ఎమ్మెల్యే మెడలో వేసి సత్కరించారు. ఆ తర్వాత స్విచాన్ చేసి.. బిందెలో నీళ్లు పట్టి బోరుబావిని ప్రారంభించారు ఎమ్మెల్యే రోజా. ఆమె ప్రారంభించిన మరుక్షణమే జనాలంతా ఎగబడి బిందెల్లో నీళ్లు పట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజా చేతికి గ్లౌజులు, ముఖానికి మాస్క్ ధరించి కనిపించారు. గ్రామ ప్రజలు కూడా కొంత సామాజిక దూరం పాటిస్తూ.. మాస్క్‌లు ధరించారు. ఐతే లాక్‌డౌన్ అమల్లో ఉన్న ఈ సమయంలో.. ఇంత చిన్న కార్యక్రమానికి అంత హడావిడి, హంగు ఆర్భాటాలు చేయలా..? అని విమర్శలు వెల్లువెత్తాయి.
First published: April 22, 2020, 4:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading