ఆస్ట్రేలియాలో భారత హైకమిషనర్‌తో రోజా భేటీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియా కంపెనీలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పథకాలను డాక్టర్ ఏఎం గొండనే అభినందించారని రోజా తెలిపారు.

news18-telugu
Updated: September 5, 2019, 5:28 PM IST
ఆస్ట్రేలియాలో భారత హైకమిషనర్‌తో రోజా భేటీ
ఆస్ట్రేలియాలో ఇండియన్ హై కమిషనర్ డాక్టర్ ఏఎం గొండనేతో వైసీపీ ఎమ్మెల్యే రోజా
news18-telugu
Updated: September 5, 2019, 5:28 PM IST
ఆస్ట్రేలియాలో భారత హైకమిషనర్‌తో వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా సమావేశం అయ్యారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆమె.. అక్కడ ఇండియన్ హై కమిషనర్ డాక్టర్ ఏఎం గొండనేతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఏపీఐఐసీ ఎలాంటి చర్యలు చేపడుతోంది? రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు, పథకాలను భారత హైకమిషనర్‌కు వివరించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను వివరించారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి విధానపరంగా, పరిశ్రమలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలను ఆయనకు విశదీకరించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియా కంపెనీలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పథకాలను డాక్టర్ ఏఎం గొండనే అభినందించారని రోజా తెలిపారు.

First published: September 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...