• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • YSRCP MLA RK ROJA AND MINISTER PEDDIREDDY RAMACHANDRA REDDY SLAMS TDP CHIEF NARA CHANDRABABUNAIDU OVER KUPPAM RESULTS IN AP PANCHAYAT ELECTIONS HERE ARE THE DETAILS PRN

Roja vs ChandraBabu: చంద్రబాబుకు రోజా పంచ్.. మనవడితో ఆడుకోవాలని సలహా..

Roja vs ChandraBabu: చంద్రబాబుకు రోజా పంచ్.. మనవడితో ఆడుకోవాలని సలహా..

ఎమ్మెల్యే రోజా (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections) సందర్భంగా అధికార వైఎస్ఆర్సీపీ (YSR Congress), ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల (Telugu Desham Party) మధ్య మాటల యుద్ధం రాజకీయాలను హీటెక్కిస్తోంది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య మాటల యుద్ధం రాజకీయాలను హీటెక్కిస్తోంది. ముఖ్యంగా మూడో విడత పోలింగ్ ముగిసిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పం.. హాట్ టాపిక్ గా మారింది. కుప్పంలో వైసీపీ ఏకంగా 75 పంచాయతీలను కైవసం చేసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై చంద్రగిరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనదైన స్టైల్లో పంచ్ లు వేశారు. చంద్రబాబు రాజకీయ జీవితానికి ఇక ఫుల్ స్టాప్ పడినట్లేనని... ఇకనైనా తన తీరుమార్చుకుని పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. సొంతగడ్డపై ఓడినా... తామే గెలిచామంటూ అసత్య ప్రచారం చేసుకోవడం తగదన్నారామె.

    మనవడితో ఆడకోవడమే..

    విశాఖ పర్యటనకు వెళ్లిన సమయంలో సీఎం జగన్ ఏంపీకారని ప్రశ్నించిన చంద్రబాబును.. కుప్పం ప్రజలే పీకి పడేశారని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. అంతేకాదు చంద్రబాబు రాజకీయ జీవితం ఇక ముగిసినట్లేనని.. ఇక ఇంటికెళ్లి మనవడితో ఆడుకోవచ్చని సూచించారు. ప్రజలు 2019లోనే చంద్రబాబుకు బుద్ధి చెప్పి 23 సీట్లకే పరిమితం చేశారన్న రోజా.. చిత్తూరులో చంద్రబాబు ఒక్కడే గెలిచారన్న సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇప్పుడు కుప్పం నుంచి కూడా ప్రజలు చంద్రబాబును తరిమికొట్టారని విమర్శిచారు. జగన్ సుపరిపాలనను ప్రజలు ఆశీర్వదిస్తున్నారన్నారు రోజా. ఇప్పటికేనా చంద్రబాబు తన పెద్దరికాన్ని కాపాడుకుంటూ జగన్ సంక్షేమ పాలనకు మద్దతిచ్చి ఆయన గౌరవాన్ని నిలబెట్టుకోవాలన్నారు. చంద్రబాబు తీరు మార్చుకోకుంటే భవిష్యత్తులో ఆ 23 సీట్లు కూడా మిగలవు.. ఒక్క సీటుకే పరిమితం కావాల్సి వస్తుందని హెచ్చరించారు.

    ఇది చదవండి: మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట...కానీ కండీషన్స్ అప్లై



    కుప్పంలో క్లీన్ బౌల్డ్
    ఇక కుప్పంలో చంద్రబాబు క్లీన్ బౌల్డ్ అయ్యారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గతంలో దొంగఓట్లతో మెజారిటీ దక్కించుకొని గెలిచారే తప్ప ప్రజాబలంతో గెలవలేదని విమర్శించారు. కుప్పంలో ఓడిపోయిన చంద్రబాబు రాజీనామా చేస్తారా అని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో చంద్రబాబు అసమర్ధుడిగా మిగిలిపోయాడాన్నారు. భవిష్యత్తులో కుప్పంలో పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు ఉందా..? అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్ పై, ప్రభుత్వం మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని.. ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో టీడీపీకి నూకలు చెల్లాయన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. చంద్రబాబు కొన్ని వ్యవస్థలను చేతుల్లో పెట్టుకొని తమను టార్గెట్ చేశారని పెద్దిరెడ్డి విమర్శించారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు