ఎడ్ల బండి మీద నుంచి పడబోయిన వైసీపీ ఎమ్మెల్యే...

వైసీపీ తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధికి తృటిలో ప్రమాదం తప్పింది. రైతు భరోసా పథకం ప్రారంభం సందర్భంగా ఈ ఘటన జరిగింది.

news18-telugu
Updated: October 16, 2019, 2:50 PM IST
ఎడ్ల బండి మీద నుంచి పడబోయిన వైసీపీ ఎమ్మెల్యే...
వైసీపీ ఎమ్మెల్యే రక్షణనిధి (File)
news18-telugu
Updated: October 16, 2019, 2:50 PM IST
వైసీపీ తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధికి తృటిలో ప్రమాదం తప్పింది. రైతు భరోసా పథకం ప్రారంభం సందర్భంగా ఈ ఘటన జరిగింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన రైతు భరోసా పథకం ప్రారంభోత్సవం సందర్భంగా తిరువూరులో భారీగా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎడ్లబండి మీద ఎమ్మెల్యే రక్షణనిధి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ కొంతదూరం బాగానే సాగింది. అయితే, రింగ్ సెంటర్‌‌కు వచ్చిన తర్వాత ఎద్దులు బెదిరిపోయాయి. దీంతో గెంతులు వేస్తూ పరుగులు పెట్టాయి. దీంతో కార్యకర్తలు హడలిపోయారు. ఆ సమయంలో ఎడ్ల బండి మీద ఎమ్మెల్యే రక్షణనిధి ఉన్నారు. ఎడ్లు రెండు సార్లు గాల్లోకి ఎగురుతూ పరుగులు పెట్టాయి. దీంతో బండి మీద ఉన్న ఎమ్మెల్యే కిందపడిపోతారేమోనని కార్యకర్తలు భయపడ్డారు. బండి మీద ఉన్న మిగిలిన నాయకులు కూడా హడలిపోయారు. చివరకు ఎలాగో ఎద్దులను కట్టడి చేశారు. వెంటనే కార్యకర్తలు వచ్చి ఎడ్ల బండి మీద నుంచి ఎమ్మెల్యే రక్షణనిధిని కిందకు దించారు. దీంతో ప్రమాదం తప్పింది. ఎద్దులు మరికొంచెం దూరం వెళ్లి ఉంటే, బండి డివైడర్‌కు ఢీకొని ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

First published: October 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...