పవన్ కళ్యాణ్‌కు వైసీపీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు.

news18-telugu
Updated: December 6, 2019, 2:56 PM IST
పవన్ కళ్యాణ్‌కు వైసీపీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్
పవన్ కళ్యాణ్(ఫైల్ ఫోటో)
  • Share this:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ నేతల తలలు నరుకుతా అని జనసేన కార్యకర్త సాకే పవన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. దీనిపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. అసలు సాకే పవన్ కుమార్ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని ప్రకాశ్ రెడ్డి అన్నారు. స్థాయికి తగ్గ వాళ్లకి పవన్ మైకులు ఇచ్చి మాట్లాడిస్తే మేలని సూచించారు.

అతన్ని టీడీపీ వాళ్ళే పోటీ చేయించారని.. అతనికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని తెలిపారు. పవన్ కళ్యాణ్ కులాల రాజకీయానికి దిగారని అన్నారు. ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రేళాపన చేయిస్తే..ప్రజలే బుద్ది చెబుతారని, తన పేరు వాడితే మైలేజ్ వస్తుందనే ఇలా దిగజారి రాజకీయాలు చేస్తున్నారని ప్రకాశ్ రెడ్డి చెప్పారు. మదనపల్లె జనసేన సమావేశంలో అనంతపురం జిల్లా జనసేన నాయకుడు సాకే పవన్ కుమార్ వైసీపీ నేతలపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.


First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>