విజయవాడలో చంద్రబాబు పక్కనే వైసీపీ ఎమ్మెల్యే దీక్ష

చంద్రబాబునాయుడు ధర్మపోరాట దీక్ష (File)

దీక్షకోసం విజయవాడ పోలీస్ కమీషనర్ కు దరఖాస్తు కూడా చేయబోతున్నానన్నానని సదరు నేత తెలిపారు.

  • Share this:
    ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి. ఇసుక కొరతకు స్వయంగా కారకుడై ఉండి ఇసుకపై చంద్రబాబు దీక్ష చేయడం విడ్డూరమంటూ సెటైర్లు వేశారు. ఏపీలో ఇసుక కొరత తీరిపోయిందని తెలిసినా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు దీక్షకు దిగుతున్నారంటూ పార్థపారథి విమర్శలు గుప్పించారు. తాను చేసిన ఇసుక కంపును ఇతరులపై రుద్దేందుకే చంద్రబాబు దీక్ష చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు సాయంత్రంలోపు నాపై చేసిన ఆరోపణలపై ఆధారాలు చూపాలన్నారు పార్థసారథి. తాను ఎక్కడ ఇసుకను దాచాను, ఏం పనులు చేశాను, కృత్రిమ కొరత సృష్టించాను అనే వాటిని నిరూపించాలన్నారు. లేదంటే చంద్రబాబు దీక్ష చేస్తున్న ధర్నా చౌక్ లోనే తాను కూడా ధర్నా చేస్తానంటూ సవాల్ విసిరారు పార్థసారథి. ఇందుకోసం విజయవాడ పోలీస్ కమీషనర్ కు దరఖాస్తు కూడా చేయబోతున్నానన్నారు.

    చంద్రబాబు నివాసం పక్కనే ఇసుక అక్రమాలు తవ్వుతున్నప్పటికి చోద్యం చూసింది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. ఆ అక్రమ తవ్వకాల వల్ల పర్యావరణం ప్రమాదంలో పడిందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది వాస్తవం కాదా అన్నారు. ఇసుక దోపిడీని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ముఖ్యమంత్రి జగన్ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారన్నారు. ఇసుక ఎంత కావాలంటే అంత ఇసుకను పారదర్శకంగా సరఫరా చేస్తున్నారన్నారు.
    First published: