చంద్రబాబును వాళ్లే పట్టించుకోవడం లేదన్న వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు పూర్తికాక ముందే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం మొదలు పెట్టారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు.

news18-telugu
Updated: November 17, 2019, 6:44 PM IST
చంద్రబాబును వాళ్లే పట్టించుకోవడం లేదన్న వైసీపీ ఎమ్మెల్యే
చంద్రబాబు నాయుడు
  • Share this:
టీడీపీలో సంక్షోభం ఏర్పడిందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. చంద్రబాబుపై సొంత పార్టీ నాయకులే తిరగబడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో టీడీపీ పతనావస్థకు చేరుకుందని అన్నారు. చంద్రబాబు దీక్ష చేస్తే 14 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారని, సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు మాట వినడం లేదని మల్లాది విష్ణు ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు దిగజారి వ్యవహరిస్తున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కుల,మతాలతో సంబంధం లేకుండా ప్రజలందరూ వైసీపీకి 151 సీట్లలో గెలిపించి జగన్‌ను ముఖ్యమంత్రిని చేశారని ఆయన అన్నారు.

ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు పూర్తికాక ముందే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం మొదలు పెట్టారని ధ్వజమెత్తారు. రాజకీయంగా ఎదుర్కొలేక చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ పెట్టి రూ.500 కోట్లు బడ్జెట్‌ కేటాయించిన ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు. చోడవరం మండలం వెంకన్న పాలెంలో జరిగిన బ్రాహ్మణ కార్తీక వన సమారాధనలో మల్లాది విష్ణు, కరణం ధర్మశ్రీ, విఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఇది కూడా చూడండి :First published: November 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...