హోమ్ /వార్తలు /రాజకీయం /

విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సీఎం జగన్ సర్‌ప్రైజ్ గిఫ్ట్...

విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సీఎం జగన్ సర్‌ప్రైజ్ గిఫ్ట్...

మల్లాది విష్ణు(ఫైల్ ఫోటో)

మల్లాది విష్ణు(ఫైల్ ఫోటో)

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గిఫ్ట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు.

  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గిఫ్ట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు కేబినెట్ బెర్త్ దక్కుతుందని అందరూ ఆశించారు. అయితే, వెల్లంపల్లి శ్రీనివాసరావును దేవాదాయ శాఖ మంత్రిగా నియమించారు జగన్. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా నియమించారు.

  మల్లాది విష్ణును ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు

  మల్లాది విష్ణు 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి విజయంసాధించారు. అనంతరం 2014లో బోండా ఉమా చేతిలో ఓడిపోయారు. మరోసారి 2019లో మల్లాది విష్ణు సెంట్రల్ టికెట్ కోసం పట్టుబట్టారు. అప్పుడు వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా కూడా అదే టికెట్ కావాలని పట్టుబట్టారు. కానీ, జగన్ మాత్రం మల్లాది విష్ణువైపే మొగ్గుచూపి రాధాను వదులుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. మల్లాది విష్ణు కూడా జగన్‌కు నమ్మినబంటుగా కొనసాగుతున్నారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Malladi Vishnu

  ఉత్తమ కథలు