Choose Municipal Ward
  CLICK HERE FOR DETAILED RESULTS

  దర్గాలో ఫ్లెక్సీని చించేసిన వైసీపీ ఎమ్మెల్యే... తన ఫొటోను తానే...

  పనులను పరిశీలిస్తున్న సమయంలో దర్గా ప్రాంగణంలో ఫ్లెక్సీలు కనబడడంతో ఆయన తొలగించారు.

  news18-telugu
  Updated: September 9, 2019, 3:57 PM IST
  దర్గాలో ఫ్లెక్సీని చించేసిన వైసీపీ ఎమ్మెల్యే... తన ఫొటోను తానే...
  బ్యానర్ తొలగిస్తున్న శ్రీధర్ రెడ్డి
  • Share this:
  నెల్లూరులోని బారా షహీద్ దర్గా రొట్టెల పండగకు సర్వం సిద్ధమైంది. మొహరం (సెప్టెంబరు 10) నుంచి సెప్టెంబర్ 14 వరకు నాలుగు రోజుల పాటు రొట్టెల పండగ జరగనుంది. ఈ వేడుకలకు సుమారు 12 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి అనిల్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బారాషహీద్ దర్గా వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. రాజకీయాలకు తావు లేకుండా పండగను వైభవంగా నిర్వహిస్తామని మంత్రి అనిల్ స్పష్టం చేశారు.

  ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి అనిల్


  గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లకు తావులేకుండా, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు మంత్రి అనిల్. స్వర్ణాల చెరువు ఘాట్ పరిశుభ్రంగా ఉండేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని కార్పొరేషన్ కమీషనర్ మూర్తిని ఆయన ఆదేశించారు. పనులను కోటంరెడ్డి శ్రీధర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని అధికారులకు చెప్పారు. రొట్టెల పండగ పూర్తయ్యే వరకు బారాషహీద్ దర్గాలోనే భక్తులకు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తెలిపారు. పనులను పరిశీలిస్తున్న సమయంలో దర్గా ప్రాంగణంలో ఫ్లెక్సీలు కనబడడంతో ఆయన తొలగించారు. తన ఫొటోతో పాటు మంత్రి అనిల్ ఫొటోలు ముద్రించి ఉన్న బ్యానర్లను స్వయంగా ఆయనే తొలగించారు. దర్గా ప్రాంగణంలో రాజకీయాలకు తావు లేదని స్పష్టంచేశారు.
  Published by: Shiva Kumar Addula
  First published: September 9, 2019, 3:57 PM IST
  మరిన్ని చదవండి
  తదుపరి వార్తలు

  Top Stories

  corona virus btn
  corona virus btn
  Loading