సొంత పార్టీపై వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి... అసెంబ్లీ సాక్షిగా...

గతంలో తమ అధినేత జగన్ పై అప్పటి మంత్రులు తీవ్రమైన పదజాలంతో దూషించారని... వారికి బుద్ధి చెప్పాలని మనసులో ఉన్నా తనకు అవకాశం ఇవ్వడం లేదని కోటంరెడ్డి వాపోయారు.

news18-telugu
Updated: January 22, 2020, 5:05 PM IST
సొంత పార్టీపై వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి... అసెంబ్లీ సాక్షిగా...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Ysrcp mla kotamreddy Sridhar reddy interesting comments in ap assembly ak
సొంత పార్టీపై వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి... అసెంబ్లీ సాక్షిగా...

ఆయన వైసీపీలో సీనియర్ ఎమ్మెల్యే. సీఎం జగన్‌కు సన్నిహితుల్లో ఒకరు. అలాంటి ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడిన మాటలతో వైసీపీ ఎమ్మెల్యేలే ఆశ్చర్యపోయారు. చాలాకాలం తరువాత అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వచ్చిన ఆ ఎమ్మెల్యే... ప్రతిపక్షంపై విమర్శలతో పాటు సొంత పార్టీపై అసంతృప్తిని కూడా తనదైన శైలిలో ప్రదర్శించడం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు... నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నేడు అసెంబ్లీలో మాట్లాడిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి... అసెంబ్లీ సాక్షిగా అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు శాసనసభలో అవకాశం ఇవ్వలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మైకు ఇవ్వాలని గొంతు చించుకుని అరిచామని, అవకాశమివ్వమని చేయి ఎత్తి నొప్పి పుట్టే వరకూ ఉంచినా ఛాన్స్ ఇవ్వడం లేదన్నారు. సభలో ప్రసంగించే వారిలో తన పేరును జాబితాలో చేర్చేందుకు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డికి ఎందుకు మనసు రావడం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అవశామిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

సొంత పార్టీపై వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి... అసెంబ్లీ సాక్షిగా... | Ysrcp mla kotamreddy Sridhar reddy interesting comments in ap assembly ak
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి


గతంలో తమ అధినేత జగన్ పై అప్పటి మంత్రులు తీవ్రమైన పదజాలంతో దూషించారని... వారికి బుద్ధి చెప్పాలని మనసులో ఉన్నా తనకు అవకాశం ఇవ్వడం లేదని కోటంరెడ్డి వాపోయారు. తమ పార్టీ నేతలే తనకు సభలో మాట్లాడనివ్వకుండా అడ్డుకుంటున్నారని కోటంరెడ్డి అన్నారు. తమ పార్టీకి చెందిన ప్రబుద్ధుడే తనకు నీతులు చెబుతున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పడం గమనార్హం. తాను తనకు బీ ఫారం ఇచ్చిన వైఎస్ జగన్ కు, తనను గెలిపించిన పార్టీ కార్యకర్తలకు, తనకు ఓటేసిన ప్రజలకు మాత్రమే తాను జవాబుదారీగా ఉంటానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: January 22, 2020, 5:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading