చంద్రబాబు ఆయనకు పెద్దన్న... మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే

స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి ఎన్నికలు వాయిదా వేయించాడనికి చంద్రబాబు సిద్ధమయ్యారని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు.

news18-telugu
Updated: February 25, 2020, 12:18 PM IST
చంద్రబాబు ఆయనకు పెద్దన్న... మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే
కొంతకాలం ఇదే అంశం చుట్టూ ఏపీ రాజకీయాలు తిరిగే అవకాశం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అమరావతి అంశంలో చంద్రబాబు వ్యూహానికి తగ్గట్టుగా టీడీపీ నేతలు వ్యవహరించలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
  • Share this:
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుది భస్మాసురా హస్తమని విమర్శించారు. భస్మాసురుడికి పెద్దన్న చంద్రబాబు నాయుడు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రం మొత్తం తగలబడి పోయిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసే అర్హత చంద్రబాబుకు లేదని అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఒక విఫల నాయకుడు చంద్రబాబు నాయుడని ఆరోపించారు. .తన ఐదేళ్ల పాలనపై ఆత్మపరిశీలన చేసుకోకుండా సీఎం జగన్ ను నరకాసురుడని విమర్శలు చేయడం దారుణమని విమర్శించారు.

ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం జగన్ లో నరకాసురుడు పాలన కనిపిస్తుందా ? అని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతిని బైట పెట్టిన జగన్మోహన్ రెడ్డిలో నరకాసుడు కనిపిస్తున్నాడా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 నెలల్లో రాజన్న రాజ్యాన్ని మించిన జగనన్న రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి తెచ్చారని వ్యాఖ్యానించారు. జనాలు లేక చంద్రబాబు జనచైతన్య యాత్రలు వెలవెలబోతున్నాయని అన్నారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి నాలుగు మంచి సలహాలు చెప్పారా ? అని ప్రశ్నించారు.

స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి ఎన్నికలు వాయిదా వేయించాడనికి చంద్రబాబు సిద్ధమయ్యారని ఆరోపించారు. చంద్రబాబు ఏ తప్పు చేయకపోతే ఎందుకు సిట్‌కు భయపడుతున్నారని ప్రశ్నించారు. సిట్ ఏర్పాటు తో టీడీపీ నేతలు చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలో ఉంటే రాష్ట్రంలో కరువు కటకాలతో ఉండేదని... జగన్ సీఎం అయ్యాక రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని అన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: February 25, 2020, 12:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading