అమ్మ చేతి గోరుముద్దలు తిన్న ఎమ్మెల్యే.. సొంతూరిలో బర్త్‌డే వేడుకలు

తల్లి ఆశీర్వాదాన్ని తీసుకొని.. అమ్మ చేతి వంటను ఆరగించారు శ్రీధర్ రెడ్డి. తల్లి చేతి గోరుముద్దలు తిని చిన్ననాటి రోజులు గుర్తు తెచ్చుకున్నారు.

news18-telugu
Updated: September 26, 2019, 7:27 PM IST
అమ్మ చేతి గోరుముద్దలు తిన్న ఎమ్మెల్యే.. సొంతూరిలో బర్త్‌డే వేడుకలు
అమ్మ చేతి గోరు ముద్ద తిన్న శ్రీధర్ రెడ్డి
  • Share this:
ఢిల్లీకి రాజైనా తల్లికి మాత్రం కొడుకే..! కోట్ల ఆస్తులు, కీర్తి ప్రతిష్ఠలున్నా అవన్నీ తల్లి ప్రేమ ముందు అవన్నీ దిగదుడుపే..! అమ్మే ఆరాధ్య దైవం..! పిల్లల కోసం ప్రాణ త్యాగానికైనా వెనకాడదు తల్లి. ఐతే ప్రస్తుత ఉరుకు పరుగులు జీవితంలో ఎంతో మంది.. తమ తల్లిదండ్రులకు దూరంగా జీవిస్తున్నారు. అలాంటి వారు కనీసం తమ బర్త్‌డే రోజైనా అమ్మతో గడపాలని సూచిస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే. ఇవాళ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పుట్టిన రోజు. బర్త్‌డే సందర్భంగా తన స్వస్థలం సంగం మండలం పడమటిపాలెంకు వెళ్లారు. తల్లి ఆశీర్వాదాన్ని తీసుకొని.. అమ్మ చేతి వంటను ఆరగించారు. తల్లి చేతి గోరుముద్దలు తిని చిన్ననాటి రోజులు గుర్తు తెచ్చుకున్నారు.

విద్యార్థి, ప్రజా ఉద్యమాలతో చిన్నతనం నుంచే కుటుంబానికి దూరంగా ఉన్నానని ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి చెప్పారు. పదవులు, డబ్బులు శాశ్వతం కావని... తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రేమే శాశ్వతమని తెలిపారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నవారు కనీసం తమ పుట్టినరోజు సందర్భంగానైనా తల్లిదండ్రుల వద్దకు వచ్చి వారితో కొంత సమయం గడపాలని సూచించారు శ్రీధర్ రెడ్డి.
Published by: Shiva Kumar Addula
First published: September 26, 2019, 7:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading