HOME » NEWS » politics » YSRCP MLA KOTAMREDDY SRIDHAR REDDY ARRESTED IN NELLORE AK

వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్... నెల్లూరులో ఉద్రిక్తత

తమ విధులకు ఆటంకం కలిగించే విధంగా వ్యవహరించడంతో పాటు వారితో అనుచితంగా మాట్లాడారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

news18-telugu
Updated: March 9, 2019, 1:09 PM IST
వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్... నెల్లూరులో ఉద్రిక్తత
పోలీసులతో మాట్లాడుతున్న వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
  • Share this:
రెండు రోజుల క్రితం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో అనుచితంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితం నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అరెస్ట్ చేసే సమయంలో అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు, అనుచరులు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారందరినీ నిలువరించి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్ చేశారు. అయితే ఆయనను ఎక్కడికి తరలించారనే విషయాన్ని మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచారు.

తమ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అనుచితంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఐపీసీ 353, 148,149, 508 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం అరెస్ట్ చేసిన తమ పార్టీ కార్యకర్తలను వెంటనే కోర్టులో హాజరుపరచాలంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి హంగామా సృష్టించారు. ఈ సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరు సరిగ్గా లేదనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు... నేడు ఆయనను అరెస్ట్ చేశారు.

First published: March 9, 2019, 12:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading