చంద్రబాబు అందులో దిట్ట... హామీలే ముఖ్యమన్న పార్ధసారధి

రాష్ట్రంలో ఎన్నికల హామీలను తుంగలోతొక్కి పేదవారికోసం చూడకుండా రాజధాని కోసం ఖర్చు చేయాలా ? అని వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారధి ప్రశ్నించారు.

news18-telugu
Updated: November 28, 2019, 4:38 PM IST
చంద్రబాబు అందులో దిట్ట... హామీలే ముఖ్యమన్న పార్ధసారధి
వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి
  • Share this:
చంద్రబాబు డ్రామాలు ఆడటంలో దిట్ట అని వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి విమర్శించారు. ఎన్టీఆర్‌ కు సినిమాలలో నటించడం వల్ల పద్మవిభూషణ్‌ వంటి బిరుదులు వచ్చాయేమో కాని చంద్రబాబు బ్రహ్మాండమైన నటుడని ఎద్దేవా చేశారు. అమరావతిలో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం వైసీపీ లేదని ఆయన అన్నారు. చంద్రబాబు సాగిలబడి నమస్కారం చేయాల్సింది శంకుస్దాపన స్దలానికి కాదని...భూములు ఇచ్చిన రైతులకు అని ఆయన వ్యాఖ్యానించారు. వారిని మోసం చేసినందుకు క్షమాపణలు చెబుతూ రైతులకు సాగిలబడాలని పార్ధసారధి అన్నారు.

మాయమాటలతో రాజధాని ప్రాంత రైతులను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. రైతులు ఇచ్చిన భూములతో తన వారికి దోచిపెట్టారని పార్ధసారధి ధ్వజమెత్తారు. లక్షకోట్లను పెట్టి రాజధాని నిర్మిస్తానని చెప్పారని... కానీ కేవలం అక్కడ సెట్టింగ్‌లు, బాహుబలి గ్రాఫిక్స్‌ చూపడం తప్పితే ఏమీ చేయలేదని ఆరోపించారు. ఐదువేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి... అన్నీ తాత్కాలిక నిర్మాణాలే చేపట్టారని అన్నారు.

రాష్ట్రంలో ఎన్నికల హామీలను తుంగలోతొక్కి పేదవారికోసం చూడకుండా రాజధాని కోసం ఖర్చు చేయాలా ? అని పార్ధసారధి ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు పర్యటన చూసి భయపడుతున్నట్లుగా లోకేష్‌ మాట్లాడుతున్నారని... అన్నపూర్ణలాంటి రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పులపాలు చేశాడని అన్నారు.First published: November 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>