వంగవీటి రాధాని కలిసిన వైసీపీ ఎమ్మెల్యే... ఏం జరుగుతోంది ?

వైసీపీ ఎమ్మెల్యేగా కొడాలి నానితో వంగవీటి రాధాకృష్ణకు మొదటి నుంచి మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాధా టీడీపీ వైపు వెళ్లకుండా ఉండేందుకు వైసీపీ పెద్దలే ఆయనను రంగంలోకి దించారా అనే ప్రచారం మొదలైంది.

news18-telugu
Updated: March 11, 2019, 5:10 PM IST
వంగవీటి రాధాని కలిసిన వైసీపీ ఎమ్మెల్యే... ఏం జరుగుతోంది ?
వంగవీటి రాధాకృష్ణ( Facebook Image)
  • Share this:
కొంతకాలం క్రితం వైసీపీని వీడిన మాజీ ఎమ్మెల్యే, వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ... చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడానికి ముహూర్తం ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది. అప్పట్లోనే టీడీపీలో చేరేందుకు సిద్దమైన వంగవీటి రాధా... అధికార పార్టీలో చేరే అంశంపై కొద్దిరోజులు ఆలోచనలో పడ్డారు. దీంతో వంగవీటి రాధా టీడీపీలో చేరతారా లేదా అనే అంశంపై ఆయన అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా వంగవీటి రాధాకృష్ణను వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కలవడం రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపింది.

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానితో వంగవీటి రాధాకృష్ణకు మొదటి నుంచి మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాధా టీడీపీ వైపు వెళ్లకుండా ఉండేందుకు వైసీపీ పెద్దలే ఆయనను రంగంలోకి దించారా అనే ప్రచారం మొదలైంది. కొడాలి నానికి పోటీగా మాజీమంత్రి దేనినేని నెహ్రూ తనయుడు దేవినేని అవివాష్‌ను రంగంలోకి దింపబోతోంది టీడీపీ. వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య ఉన్న రాజకీయ వైరం కారణంగా... టీడీపీలో చేరినా దేవినేని అవివాష్‌కు వంగవీటి రాధా మద్దతు ఇచ్చే అవకాశాలు లేవని కొందరు చర్చించుకుంటున్నారు. గుడివాడ నియోజకవర్గంలో కాపు ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని, వంగవీటి రాధాకృష్ణ భేటీ కృష్ణా జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది.


First published: March 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>