బాలయ్యపై వైసీపీ ఎమ్మెల్యే... ‘బుల్ బుల్’ సెటైర్..

Nandamuri Bala Krishna | బాలకృష్ణ మద్యం తాగి బహిరంగసభల్లో పాల్గొని ఉద్దూ గీతాన్ని అవమానించారని వైసీపీ ఎమ్మెల్యే ఆరోపించారు.

news18-telugu
Updated: July 25, 2019, 7:01 PM IST
బాలయ్యపై వైసీపీ ఎమ్మెల్యే... ‘బుల్ బుల్’ సెటైర్..
నందమూరి బాలకృష్ణ
  • Share this:
నందమూరి బాలకృష్ణపై వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సెటైర్లు వేశారు. ఏపీలో కొత్త మద్యం పాలసీ మీద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సెటైర్లు వేశారు. మద్యం తాగి నోటికి వచ్చినట్టు మాట్లాడిన వారి మీద చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏ మాత్రం చర్యలు తీసుకోలేదన్నారు. సాక్షాత్తూ ఎన్నికల బహిరంగ సభలో టీడీపీ నేతలు.. మద్యం తాగి ఉర్దూ గీతాన్ని అవమానించారని పద్మావతి ఆరోపించారు. అయినా సరే బాలకృష్ణ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. భవిష్యత్తులో బహిరంగ సభలకు వెళ్లే టీడీపీ నేతలకు ముందే బ్రీత్ ఎనలైజర్ టెస్టులు నిర్వహించాలని సెటైర్ వేశారు.

First published: July 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు