చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే కౌంటర్... అవినీతి చేస్తే...

చంద్రబాబు ఐదేళ్ల పరిపాలనలో అన్నీ అక్రమాలు, అరాచకాలు, దుర్మార్గాలే అని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ విమర్శించారు. ఆయన పరిపాలన అంతా అవినీతిమయమే అని మండిపడ్డారు.

news18-telugu
Updated: August 7, 2019, 6:56 PM IST
చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే కౌంటర్... అవినీతి చేస్తే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ విమర్శలు గుప్పించింది. ఆయన కుట్రలు ఇంకా బయటపడుతున్నాయని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ఐదేళ్ల పరిపాలనలో అన్నీ అక్రమాలు, అరాచకాలు, దుర్మార్గాలే అని విమర్శించారు. ఆయన పరిపాలన అంతా అవినీతిమయమే అని జోగి రమేశ్ మండిపడ్డారు. గతంలో నా రోడ్లపై నడుస్తున్నారు... నాకు ఓట్లు వేయాండంటూ చంద్రబాబు వ్యాఖ్యానిస్తే ప్రజలు బుద్ధి చెప్పారని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఓడినా చంద్రబాబు మైండ్ సెట్ ఇంకా మారలేదని జోగి రమేశ్ చంద్రబాబు తీరును తప్పుబట్టారు. ఆయన చరిత్ర అంతా రక్తచరిత్రే అని తీవ్ర ఆరోపణలు చేశారు.

ముఖ్యమంత్రి జగన్ పాలన అంతా పారదర్శకంగా సాగుతోందని... ప్రజలు మెచ్చే విధంగా ఉంటోందని ఎమ్మెల్యే జోగి రమేశ్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ప్రధానికి ఫిర్యాదు చేస్తే చంద్రబాబుకు ఎందుకంత ఉలిక్కిపడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే మండిపడ్డారు. అవినీతి చేస్తే ఫిర్యాదు చేయొద్దా అని ప్రశ్నించారు. ఐదేళ్లలో జరిగిన ప్రతి అవినీతిని వెలికితీస్తామని అన్నారు. రూ.400 కోట్లు దోచుకునేందుకే పట్టిసీమ కట్టారని ఆరోపించారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులను చంద్రబాబు నట్టేట ముంచారని అన్నారు. అమరావతి అంటూ ప్రజలకు భ్రమలు కల్పించారని జోగి రమేశ్ విమర్శించారు.


First published: August 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు