అమరావతి ఓ బాహుబలి గ్రాఫిక్స్ సెట్టింగ్... వైసీపీ ఎమ్మెల్యే విమర్శలు

జగన్ రాజధాని నడిబొడ్డున గృహం నిర్మించుకున్నారన్నారు. మరి చంద్రబాబు ఇన్నాళ్లు రాజధానిలో ఎందుకు ఇల్లు కట్టుకోలేకపోయారని ప్రశ్నించారు ఎమ్మెల్యే జోగి రమేష్.

news18-telugu
Updated: July 20, 2019, 1:13 PM IST
అమరావతి ఓ బాహుబలి గ్రాఫిక్స్ సెట్టింగ్... వైసీపీ ఎమ్మెల్యే విమర్శలు
సీఎం జగన్, అమరావతి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రాజధాని పేరుతో చంద్రబాబు అంతర్జాతీయస్కామ్ కు పాల్పడ్డారని ఆరోపించారు పెడన ఎమ్మెల్యే జోగి రమేష్.  బాహుబలి గ్రాఫిక్స్ సెట్టింగ్స్ తప్ప ఎల్లో మీడియా ప్రచారార్భాటాలు తప్ప రాజధాని నిర్మాణంలో ఏం జరగలేదన్నారు. కనీసం రాజధానికి రహదారులు కూడా నిర్మించలేదని విమర్శించారు. రాజధానిలో చంద్రబాబు సర్కార్ అడగడునా ఉల్లంఘనలకు పాల్పడిందని ఆరోపించారు. చంద్రబాబూ రాజధాని రైతులు మీతో కలసి వచ్చారా? అంటూ మాజీ  ముఖ్యమంత్రిని ఆయన ప్రశ్నించారు.  అమరావతిని ఓ భ్రమరావతిగా చూపించారని మండిపడ్డారు

మంత్రులను,అధికారులను పంపించి రైతులను భయభ్రాంతులకు గురిచేశారని జోగిరమేష్ చంద్రబాబుపై విమర్శల దాడికి దిగారు. మకీ సంస్ధ మీ అసమర్ధతను అవినీతిని ఎండగడుతూ బహిరంగ లేఖ రాసిందన్నారు. ప్రపంచ బ్యాంక్ రుణం వెనకకు వెళ్లడమేంటి? అని ప్రశ్నించారు. ప్రపంచబ్యాంక్ ద్వారా జూన్ 12న ఓ లేఖ వచ్చిందన్నారు. వ్యవసాయ భూమిని ప్రభుత్వం రైతుల వద్దనుంచి లాక్కుంది అని ఆ లేఖలో పేర్కొని ఉందన్నారు వైసీపీ ఎమ్మెల్యే.

చంద్రబాబు నిర్వాకం వల్లనే ప్రపంచబ్యాంక్ రుణం రాలేదని దుయ్యబట్టారు. ఏపిలో చంద్రబాబుదే తుగ్లక్ పాలన అంటూ మండిపడ్డారు. లోకేష్ ట్వీట్లు చేసేముందు ఈ విషయం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. జగన్ రాజధాని నడిబొడ్డున గృహం నిర్మించుకున్నారన్నారు. మరి చంద్రబాబు ఇన్నాళ్లు రాజధానిలో ఎందుకు ఇల్లు కట్టుకోలేకపోయారని ప్రశ్నించారు.వైసీపీపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం మానుకోవాలన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో ఎంత దోచుకున్నారో అంతా బయటకు తీయిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు టిడిపి నేతలు రాజధాని నిర్మాణంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జోగి రమేష్ ఆరోపించారు. రాజధాని ప్రాంత రైతులకు మీరు ఏమాత్రం న్యాయం చేశారు? అంటూ చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో భూములు కేటాయింపుల దగ్గర్నుంచి అన్నింటా నిబంధనలు ఉల్లంఘించారని తీవ్రంగా విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే ప్రజలు మనస్సు గెలుచుకుందన్నారు.

First published: July 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...