చంద్రబాబును చూస్తే ఆటోమెటిక్‌గా... రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

YSRCP MLA ROJA | చంద్రబాబును తాను ఎందుకు అంతలా విమర్శిస్తాననే విషయంపై పరోక్షంగా స్పందించారు రోజా.

news18-telugu
Updated: July 30, 2019, 2:32 PM IST
చంద్రబాబును చూస్తే ఆటోమెటిక్‌గా... రోజా ఆసక్తికర వ్యాఖ్యలు
ఎమ్మెల్యే రోజా (File)
  • Share this:
టీడీపీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబును వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏ రేంజ్‌లో విమర్శిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చంద్రబాబును ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శించడంలో వైసీపీ ఎమ్మెల్యేలందరి కంటే ముందుంటారు రోజా. అయితే చంద్రబాబును తాను ఎందుకు అంతలా విమర్శిస్తాననే విషయంపై పరోక్షంగా స్పందించారు రోజా. అసెంబ్లీ లాబీల్లో రోజా, పయ్యావుల కేశవ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా రోజా ప్రసంగంలో వాడి తగ్గిందన్న టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ రోజాతో వ్యాఖ్యానించారు. అయితే ఇందుకు తనదైన స్టయిల్లో స్పందించిన రోజా... టీడీపీ అధినేత చంద్రబాబు సభలో లేకపోవడం వల్లే గట్టిగా తిట్టలేకపోయానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబును చూస్తే ఆటోమెటిక్‌గా తన ప్రసంగం ఫ్లో పెరుగుతుందని రోజా అన్నారు. అయితే రోజా మౌనం వెనుక కారణం అది కాకపోవచ్చన్న పయ్యావుల కేశవ్ అన్నారు. మరోవైపు చంద్రబాబు లేని సమయం చూసి జగన్‌ను పయ్యావుల పొగిడారని రోజా వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన పయ్యావుల కేశవ్... తాము తేవాలనుకున్న బిల్లు తెచ్చారు కాబట్టే ప్రశంసించానని వివరణ ఇచ్చారు.


First published: July 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు