‘చంద్రబాబుకు అవి తప్ప ఏమీ తెలియదు’

ప్రభుత్వంపై నారా లోకేష్‌ చేసిన వ్యాఖ్యలు, ట్వీట్ల మీద చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: May 23, 2020, 9:49 PM IST
‘చంద్రబాబుకు అవి తప్ప ఏమీ తెలియదు’
చంద్రబాబు(ఫైల్ ఫోటో)
  • Share this:
చంద్రబాబుకు మార్కెటింగ్, మేనేజింగ్, పబ్లిసిటీ తప్ప ఏమీ తెలియదని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ తీవ్రంగా విరుచుపడ్డారు. చంద్రబాబుది కరోనా కుటుంబం అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టులో కేసులు వేసుకుంటూ చంద్రబాబు బ్రతికేస్తున్నారని విమర్శించారు. మూడు నెలలుగా చంద్రబాబు జూమ్ యాప్‌లో తప్ప ఎక్కడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. జగన్‌కు మంచి పేరు రాకుండా అడ్డుకోవాలని అనునిత్యం ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై నారా లోకేష్‌ చేసిన వ్యాఖ్యలు, ట్వీట్ల మీద చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Chandrababu naidu, ysrcp mla gudiwada amarnath, cm ys jagan mohan reddy, tdp, ysrcp, ap news, ap politics, చంద్రబాబునాయుడు, వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ, వైసీపీ, ఏపీ న్యూస్, ఏపీ రాజకీయాలు
వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్(ఫైల్ ఫోటో)


అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే తమ ప్రభుత్వం ఎన్నికల హామీలను 90శాతం నెరవేర్చిందని ఆయన వ్యాఖ్యానించారు. కష్టకాలంలో సైతం ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేనలతో పోరాటం చేసి తమ పార్టీ 151 సీట్లు సాధించారని... ఈ ఘటన సీఎం జగన్‌కే దక్కుతుందని కొనియాడారు. ఈ విజయం చరిత్రలో మిగిలిపోతుందని అన్నారు.
First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading