అలాంటి జిల్లా మాకొద్దు.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

లోక్ సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేయాలనే యోచన సరికాదని వైసీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.

news18-telugu
Updated: July 8, 2020, 4:13 PM IST
అలాంటి జిల్లా మాకొద్దు.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ధర్మాన ప్రసాదరావు(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ యోచిస్తోంది. ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. దీంతో ఏపీలో కొత్తగా 12 జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను కలుపుకుంటే రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 25కు చేరుకోనుంది. అయితే అక్కడక్కడ తమ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. తాజాగా జిల్లాల పునర్విభజన విషయంలో ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే గళం విప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు జిల్లాల పునర్విభజనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

లోక్ సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేయాలనే యోచన సరికాదని ఆయన అన్నారు. ఎచ్చెర్ల, రాజాం, పాలకొండ లేని శ్రీకాకుళం జిల్లాను ఊహించుకుంటేనే భయంగా ఉందని ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. కొత్త జిల్లాల ఏర్పాటును తాను స్వాగతిస్తున్నానని... అయితే ఈ విషయంలో ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలా జరగకపోతే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలను ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సమర్థించారు. ఇది కేవలం ధర్మాన అభిప్రాయం కాదని... జిల్లా ప్రజల అభిప్రాయమని ఆయన అన్నారు. ఈ విషయంలో సీఎం జగన్ అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటారనే నమ్మకం ఉందని తమ్మినేని సీతారాం తెలిపారు.

Published by: Kishore Akkaladevi
First published: July 8, 2020, 4:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading