వైసీపీలో మరో వారసుడు... పోటీకి ముందే దూకుడు

వైసీపీలో భూమన కరుణాకర్ రెడ్డి ఓ సీనియర్ నేత. అయితే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఆయన అప్పట్లో ప్రకటించారు.

news18-telugu
Updated: March 17, 2020, 8:32 PM IST
వైసీపీలో మరో వారసుడు... పోటీకి ముందే దూకుడు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నేతల వారసులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. రాజకీయాల్లోకి రావడానికి ముందే తమ పెద్దల దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకుంటుంటారు ఈ తరం యువనేతలు. ఏపీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి కూడా ఇదే రకంగా రాజకీయాల్లో దూకుడు ప్రదర్శిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. వైసీపీలో భూమన కరుణాకర్ రెడ్డి ఓ సీనియర్ నేత. అయితే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఆయన అప్పట్లో ప్రకటించారు. కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకే ఆయన ఈ రకమైన ప్రకటన చేశారని అప్పట్లో అంతా అనుకున్నారు.

తాజాగా ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి తిరుపతి రాజకీయాల్లో దూకుడు ప్రదర్శించడాన్ని చూస్తున్న చాలామంది నేతలు... తండ్రి అడుగుజాడల్లోనే అభినయ్ రెడ్డి కూడా నడుస్తున్నాడని చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే తిరుపతిలో వైసీపీకి టీడీపీ బలమైన ప్రత్యర్థిగా ఉంది. గత ఎన్నికల్లో భూమన ఎమ్మెల్యేగా గెలిచినా... టీడీపీ కూడా గణనీయమైన స్థాయిలో ఓట్లు సాధించింది. దీంతో రాబోయే ఎన్నికల నాటికి ఆ పార్టీని దెబ్బకొట్టేందుకు వైసీపీ ఎమ్మెల్యే భూమన, తన కుమారుడు అభినయ్‌తో కలిసి ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

వైసీపీలో మరో వారసుడు... పోటీకి ముందే దూకుడు | Ysrcp mla bhumana karunakar reddy make his son abhinay reddy active in tirupathi politics ak
భూమన కరుణాకర్ రెడ్డి (File)


టీడీపీలోని పలువురు ద్వితీయ శ్రేణి నాయకులను తమ వైపు తిప్పుకోవడంతో వీరిద్దరు సక్సెస్ అవుతున్నారని సమాచారం. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో టీడీపీ శ్రేణులకు ఏర్పడిన గ్యాప్ కూడా వీరికి కలిసొస్తుందని జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి రాబోయే ఎన్నికల నాటికి భూమన కరుణాకర్ రెడ్డి తన కుమారుడికి తిరుపతిలో ఎదురులేకుండా చేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది.
First published: March 17, 2020, 8:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading