గ్రామ వాలంటీర్లపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు...

గ్రామ / వార్డు వాలంటీర్ల వ్యవస్థపై వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

news18-telugu
Updated: February 16, 2020, 9:52 PM IST
గ్రామ వాలంటీర్లపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు...
(ప్రతీకాత్మక చిత్రం, image: AP CM YS Jagan File Photo)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ / వార్డు వాలంటీర్ల (gram / ward volunteer) వ్యవస్థపై వైసీపీ మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి (Bala Nagireddy) సంచలన ఆరోపణలు చేశారు. పేదల దగ్గర గ్రామ వాలంటీర్లు డబ్బులు వసూలు చేస్తున్నారని, వసూలు చేసిన డబ్బులను నేతలకు ఇస్తున్నారని సంచలన విషయాలు వెల్లడించారు. వాలంటీర్లు డబ్బులు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇష్టం లేకుంటే ఉద్యోగం వదిలి వెళ్లిపోవాలని బాలనాగిరెడ్డి సూచించారు. ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను వారి గడపవద్దకే చేర్చేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఈ గ్రామ / వార్డు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. రాష్ట్రంలో సుమారు 4లక్షల మంది గ్రామ / వార్డు వాలంటీర్లు ఎంపికయ్యారు. ప్రతి ఒక్కరికీ 50 ఇళ్ల చొప్పున కేటాయించారు. దీంతో ఆయా వాలంటీర్లు తమకు కేటాయించిన ఇంటికి సంబంధించిన పింఛన్లు అందిస్తున్నారు. ఫిబ్రవరి నెల పింఛన్ల సొమ్ములను గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి అందజేశారు. భవిష్యత్తులో వారి ద్వారా మరిన్ని సేవలను గడప వద్దకే తీసుకురావాలని జగన్ భావిస్తున్నారు.

గ్రామ / వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం నెలకు రూ.5000 గౌరవ వేతనం అందిస్తోంది. దాన్ని రూ.8000కు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక నిర్ణయం రావాల్సి ఉంది. కానీ, కొందరు వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను పొందే లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. గతంలో కూడా కొందరి మీద ఇలాంటి అవినీతి ఆరోపణలు రావడంతో వారిని తొలగించారు. అయితే, ఇప్పుడు ఏకంగా వాలంటీర్లు డబ్బులు వసూలు చేసి వాటిని నేతలకే ఇస్తున్నారని బాలనాగిరెడ్డి ఆరోపించడం సంచలనంగా మారింది.

First published: February 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు