బర్త్‌డే రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రోజా

నగరిలోని తన నివాసం వద్ద ఓ వెయిట్ మిషన్ ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ తీసుకొచ్చిన వారికి బియ్యం ఇచ్చారు.

news18-telugu
Updated: November 17, 2019, 5:38 PM IST
బర్త్‌డే రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రోజా
రోజా సెల్వమణి
  • Share this:
వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా సెల్వమణి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చడానికి ఆమె సంకల్పించారు. ఈ క్రమంలో తన పుట్టినరోజు (నవంబర్ 17) నుంచి ఆమె ఓ కొత్త పథకాన్ని తీసుకొస్తానని గతంలో చెప్పారు. నియోజకవర్గంలోని ప్లాస్టిక్‌ను తీసుకొస్తే.. కేజీ ప్లాస్టిక్‌కు కేజీ బియ్యం ఇస్తామని చెప్పారు. అన్నట్టుగానే ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరిలోని తన నివాసం వద్ద ఓ వెయిట్ మిషన్ ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ తీసుకొచ్చిన వారికి బియ్యం ఇచ్చారు. తన పుట్టిన రోజు నుంచి సీఎం జగన్ బర్త్ డే వరకు (డిసెంబర్ 21) ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం తన పుట్టిన రోజు సందర్భంగా ఓ కొత్త నిర్ణయాన్ని రోజా అమలు చేస్తున్నారు. ఓ సారి తన నియోజకవర్గంలోని నిరుద్యోగుల కోసం జాబ్ మేళా నిర్వహించారు. మరోసారి వైఎస్ఆర్ క్యాంటీన్ నెలకొల్పారు. ఇప్పుడు నో ప్లాస్టిక్ - న్యూ నగరి పేరుతో మరో కొత్త కార్యక్రమం చేపట్టారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 17, 2019, 5:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading