ఎమ్మెల్యే రోజా మాతృ హృదయం.. పోలీసుల కోసం స్వయంగా వంట చేసి..

MLA Roja : రాజకీయాల్లో, షూటింగ్‌లతో బిజీగా ఉన్నా ఆమె ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు రోజా. ఏపీఐఐసీ ఛైర్ పర్సన్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. సామాజిక సేవ కూడా చేస్తున్నారామె.

news18-telugu
Updated: April 2, 2020, 7:58 AM IST
ఎమ్మెల్యే రోజా మాతృ హృదయం.. పోలీసుల కోసం స్వయంగా వంట చేసి..
వంట చేస్తున్న ఎమ్మెల్యే రోజా
  • Share this:
MLA Roja : ఆమె మైక్ పడితే ప్రతిపక్షాలు గజగజ వణుకుతాయి.. ఆమె కెమెరా ముందుకు వస్తే నటన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తారు.. మొత్తంగా ఆమె ఒక ఫైర్ బ్రాండ్. నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా మాట్లాడేందుకు ఏ మాత్రం సంకోచించరు. ఆమే.. నగరి ఎమ్మెల్యే రోజా. రాజకీయాల్లో, షూటింగ్‌లతో బిజీగా ఉన్నా ఆమె ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు. ఏపీఐఐసీ ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. సామాజిక సేవ కూడా చేస్తున్నారామె. అయితే, తాజాగా.. ఆమె పోలీసుల కోసం తానే స్వయంగా వంట చేసి పెట్టారు. కరోనా దెబ్బకు దేశమంతా లాక్‌డౌన్ అయ్యింది. ప్రజలను గడప దాటనీయకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైద్యులు, పారిశుధ్య కార్మికులు కూడా ప్రజల కోసం కంటి మీద కునుకు లేకుండా కష్టపడుతున్న వీరికోసం తన వంతుగా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు రోజా.

డాక్టర్లు, మెడికల్ సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికుల కోసం మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పించారు. రోజా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం తానే స్వయంగా కూరగాయలు కోసి, వంట చేశారు. అనంతరం ఆమే.. స్వయంగా భోజనం వడ్డించారు.

Published by: Shravan Kumar Bommakanti
First published: April 2, 2020, 7:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading