Home /News /politics /

YSRCP MLA AND CHIEF WHIP SRIKANTH REDDY SLEEP FOR SOMETIME WHILE MINISTER BUGGANA PRESENTING AP BUDGET AK

AP Budget: బడ్జెట్ ప్రవేశపెట్టిన బుగ్గన... చీఫ్ విప్ కునుకు

బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో కునుకు తీస్తున్న శ్రీకాంత్ రెడ్డి(స్క్రీన్ గ్రాబ్)

బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో కునుకు తీస్తున్న శ్రీకాంత్ రెడ్డి(స్క్రీన్ గ్రాబ్)

బడ్జెట్ ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా విన్న శ్రీకాంత్ రెడ్డి... మధ్య మధ్యలో కాసేపు కునుకు తీయడంతో పాటు ఆవలింతలు తీశారు.

    ఏపీ అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం తొలి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను సభ ముందు ఉంచారు. బడ్జెట్ ప్రాధాన్యతలు, కేటాయింపులను సుదీర్ఘంగా సభలోని సభ్యులకు వివరించారు. అయితే మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రసంగం చేస్తున్న సమయంలోనే... ఆ పక్కన ఉన్న ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కాసేపు కునుకు తీశారు. బడ్జెట్ ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా విన్న శ్రీకాంత్ రెడ్డి... మధ్య మధ్యలో కాసేపు కునుకు తీయడంతో పాటు ఆవలింతలు తీశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. సీఎం జగన్ వెనుక సీట్లోనే కూర్చున్న శ్రీకాంత్ రెడ్డి... బడ్జెట్‌లోని కేటాయింపులను చాలా సేపు ఆసక్తిగా గమనించారు. అయితే మధ్య మధ్యలో కొంత కునుకు తీశారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhrapradesh Budget 2019-20, AP Assembly, AP Chief Whip Srikanth Reddy, Ap cm ys jagan mohan reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు