ఆ రోజుల్లో.. మా కాలేజీలో... జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న రోజా...

Roja Selvamani | రోజా 1989లో చిత్తూరు జిల్లాలోని పద్మావతి ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ పూర్తిచేశారు. అనంతరం సినిమాల్లోకి వెళ్లారు.

news18-telugu
Updated: November 8, 2019, 8:51 PM IST
ఆ రోజుల్లో.. మా కాలేజీలో... జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న రోజా...
రోజా సెల్వమణి (File)
  • Share this:
వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా సెల్వమణి తన కాలేజీ రోజుల గురించి గుర్తు చేసుకున్నారు. చిత్తూరు జిల్లాలోని ఓ కాలేజీ ఫంక్షన్‌కు హాజరైన సినీ నటి.. ప్రస్తుతం కాలంలో చదువులపై కూడా సెటైర్లు వేశారు. ‘ప్రస్తుతం చాలా మంది పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. కానీ సబ్జెక్ట్‌లో పట్టున్న వారు పెద్దగా లేరు. అంతా మార్కుల మాయాజాలంలో కొట్టుకుపోతున్నారు. నేను కూడా చిత్తూరు జిల్లాలోనే చదివా. బైపీసీ స్టూడెంట్‌ని. పద్మావతి ఉమెన్స్ కాలేజీలో చదివా. ఇంటర్ తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంతో ఎక్కువ చదువుకునే అవకాశం రాలేదు. కానీ, బాధపడలేదు. ఈ రోజుల్లోలా రోజుకు 12 గంటలు చదవడం నా వల్లకాదు. ఇప్పటికీ కాలేజీ ఫంక్షన్లకు వెళ్లాలంటే నాకు కాళ్లు వణుకుతాయి. అందుకే మోడ్రన్ చదువులు చదవలేకపోయా.’ అని రోజా అన్నారు. ప్రజలకు సేవ చేసేలా ఏ రంగమైనా మంచిదేనని రోజా అన్నారు. సినిమా, రాజకీయాల్లో కూడా చేరవచ్చని సూచించారు. రోజా 1989లో చిత్తూరు జిల్లాలోని పద్మావతి ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసినట్టు తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

First published: November 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు