ఇసుక దుమారం... చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా ఎటాక్..

చంద్రబాబు, రోజా

ప్రజలు టీడీపీని 23 సీట్లకే పరిమితం చేయడంతో చంద్రబాబు చిన్నమెదడు చితికిపోయిందని రోజా అన్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడుపై ఏపీఐఐసీ చైర్‌పర్సన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శల దాడి చేశారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసినందుకు ఆయన్ను ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. ‘ప్రజలు టీడీపీని 23 సీట్లకే పరిమితం చేసినందుకు చంద్రబాబు చిన్నమెదడు చితికిపోయింది. అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.’ అని రోజా మండిపడ్డారు. కరువు, చంద్రబాబు కవలపిల్లలని... అందుకే చంద్రబాబునాయుడి హయాంలో వర్షాలు పడలేదన్నారు. వర్షాలు పడకపోవడం వల్ల ఇసుక అడ్డంగా దోచుకున్నారని ఆరోపించారు. అయితే, జగన్ చల్లటి పాదం వల్ల వర్షాలు బాగా పడ్డాయని.. ఇసుక అందించడం కాస్త ఆలస్యమైతే పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని రోజా మండిపడ్డారు.

    ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక దుమారం రేగుతోంది. ఐదు నెలలుగా ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లభించలేదు. దీంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం విధానం మీద విమర్శల దాడి చేస్తున్నాయి. అక్టోబర్ 30న నారా లోకేష్ గుంటూరు వేదికగా ఒకరోజు దీక్ష చేశారు. నవంబర్ 3న విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ చేపట్టారు. నవంబర్ 4న బీజేపీ నేతలు ఇసుక సత్యాగ్రహం చేశారు. ఇలా ప్రతిపక్షాల నుంచి విమర్శల దాడి పెరగడంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణా చేసేవారిని జైలుకు పంపేలా చట్టం తేవాలన్నారు. ఇసుక ఎక్కడెక్కడ ఏయే ధరలకు విక్రయించాలో ధరలు నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు.
    First published: