దయచేసి నా సీటు మార్చండి... స్పీకర్‌కు వైసీపీ ఎమ్మెల్యే ఆనం విజ్ఞప్తి

ఆనం రామనారాయణరెడ్డి (File)

పక్కసీటులో ఉన్న ప్రతిపక్ష నాయకుడు తన దగ్గర వస్తుంటే.. నేనింకా ఏమేం మాట్లాడుతానని ఆనం ఆవేదన వ్యక్తం చేశారు.

  • Share this:
    ఏపీ అసెంబ్లీలో మొదటిరోజే రచ్చ రచ్చ మొదలయ్యింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం నెలకొంది. పీపీఏల విషయంపై ఇరు వర్గాల మధ్య మాటల దాడిరాజుకుంది. దీంతో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన క్లారిటీ ఇచ్చినా టీడీపీ నేతలు వెనక్కి తగ్గలేదు. ఇతర సభ్యుల మాట్లాడుతుంటే... వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి దయచేసి నా సీటు మార్చండి అంటూ... స్పీకర్‌కు విన్నవించారు. ప్రతిపక్ష నాయకులు తమ వద్దకు వచ్చి మాట్లాడుతుంటే.. నేనేం మాట్లాడుతానని ఆనం ఆరోపించారు. పక్కసీటులో ఉన్న ఆయన తన దగ్గర వస్తుంటే.. నేనింకా ఏమేం మాట్లాడుతానని ఆనం ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కన్నా తాను చాలా జూనియర్ అన్నారు ఆనం.
    Published by:Sulthana Begum Shaik
    First published: