బీజేపీకి ఏం సంబంధం ?.. పవన్ మారలేదన్న వైసీపీ ఎమ్మెల్యే

బీజేపీతో పవన్‌ కళ్యాణ్‌ కలిసినా ఇంకా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు.

news18-telugu
Updated: January 25, 2020, 5:14 PM IST
బీజేపీకి ఏం సంబంధం ?.. పవన్ మారలేదన్న వైసీపీ ఎమ్మెల్యే
అంబటి రాంబాబు
  • Share this:
రాజధాని అంశంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. మూడు రాజధానులు, హైకోర్టు ఏర్పాటుపై బీజేపీ నేతల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ నేత సునీల్‌ డియోదర్‌ రాజదాని అంశంపై బీజేపీతో చర్చించలేదని అంటున్నారని... అసలు బీజేపీతో చర్చించామని తాము ఎప్పుడైనా చెప్పామా ? అని ఆయన ప్రశ్నించారు. హైకోర్టు ను శాశ్వతంగా రాయలసీమలో ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతలు చెప్పారని అంబటి గుర్తు చేశారు. రాయలసీమ లో హైకోర్టు పెట్టడానికి బీజేపీ నేతలు కట్టుబడి ఉన్నారా లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.వికేంద్రీకరణకు అనుకూలమని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిందని అన్నారు. అమరావతి నిర్మాణం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంగా మారిందని బీజేపీ మేనిఫెస్టోలో చెప్పిందని అంబటి వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంత భూములు తిరిగి వెనక్కి ఇస్తామని బీజేపీ చెప్పిందని అన్నారు.

బీజేపీతో పవన్‌ కళ్యాణ్‌ కలిసినా ఇంకా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని విప్లవాత్మకమైన సంస్కరణలు జగన్మోహన్‌ రెడ్డి తెస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం మాకేమిటని ప్రశ్నించిన అంబటి... ప్రజాస్వామ్యానికి ఖునీ చేసింది చంద్రబాబు నాయుడే అని ఆరోపించారు. మండలి రద్దు అవుతుందా లేదా అన్నది సోమవారం వరకు వేచి చూడండని చెప్పారు. మండలి రద్దు చేయడం ఎవరి వల్ల కాదని టీడీపీ నేతలు అంటున్నారని... గతంలో ఎన్టీఆర్‌ మండలి రద్దు చేయలేదా అని అన్నారు. మండలి చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడినప్పుడు ఎలాంటి నిర్ణమైన తీసుకుంటామని అన్నారు.
First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు