70 ఏళ్ల వయసులో చంద్రబాబు బూతులు నేర్చుకుంటున్నారు : అంబటి

అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కూర్చునే సీటుకు సమీపంలోనే తాను కూర్చుంటానని.. ఆవిధంగా ఆయన్ను దగ్గరగా పరిశీలించే అవకాశం తనకు కలుగుతోందని అన్నారు.

news18-telugu
Updated: December 13, 2019, 3:18 PM IST
70 ఏళ్ల వయసులో చంద్రబాబు బూతులు నేర్చుకుంటున్నారు : అంబటి
చంద్రబాబు, అంబటి రాంబాబు
  • Share this:
టీడీపీ అధినేత చంద్రబాబు 70 ఏళ్ల వయసులో బూతులు నేర్చుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడిన పదాలే అందుకు నిదర్శనం అన్నారు. మార్షల్స్ పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు సరికాదని.. బూతులు మాట్లాడుతూ క్రమశిక్షణారాహిత్యంతో వ్యవహరించినవారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. ఇలాంటి వాటిని ఉపేక్షిస్తే అందరూ హౌజ్‌ను డిజార్డర్ చేసే పరిస్థితి వస్తుందన్నారు. కాబట్టి చంద్రబాబుపై తక్షణమే చర్యలకు డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కూర్చునే సీటుకు సమీపంలోనే తాను కూర్చుంటానని.. ఆవిధంగా ఆయన్ను దగ్గరగా పరిశీలించే అవకాశం తనకు కలుగుతోందని అన్నారు. 70 ఏళ్ల వయసున్న చంద్రబాబు.. ఇంకా 25 ఏళ్ల వయసులో ఉన్నట్టే ప్రవర్తిస్తారని విమర్శించారు. అసెంబ్లీలో హౌజ్ డిజార్డర్‌కి చంద్రబాబు ప్రయత్నించడం దురదృష్టకరం అన్నారు.

First published: December 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>