జగన్‌ను జైల్లో పెట్టించింది నువ్వు కాదా..? : చంద్రబాబుపై అంబటి విమర్శలు

సోనియా గాంధీతో చేతులు కలిపి జగన్‌ను 16 నెలలు జైల్లో పెట్టించింది నువ్వు కాదా? అని చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు.

news18-telugu
Updated: December 14, 2019, 5:24 PM IST
జగన్‌ను జైల్లో పెట్టించింది నువ్వు కాదా..? : చంద్రబాబుపై అంబటి విమర్శలు
చంద్రబాబు, అంబటి రాంబాబు
  • Share this:
దివంగత సీఎం వైఎస్సార్ మరణం తర్వాత చంద్రబాబు దారుణమైన పరిస్థితులు సృష్టించారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. సోనియా గాంధీతో చేతులు కలిపి జగన్‌ను 16 నెలలు జైల్లో పెట్టించింది నువ్వు కాదా? అని చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ అవిశ్వాస తీర్మానం పెడితే.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ప్రభుత్వానికి మద్దతు పలికి నీచానికి ఒడిగట్టిందని మండిపడ్డారు. ఉన్నతాధికారి కృష్ణ కిశోర్‌పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తమ ప్రభుత్వానికి ఆ అవసరం లేదని,జగన్మోహన్ రెడ్డి గారికి అంతకంటే అవసరం లేదని స్పష్టం చేశారు.


First published: December 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>