పేరు నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్... ఎలాగో చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే

50 శాతం మంది ప్రజలు సీఎం జగన్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని... ఒక్క పవన్ కళ్యాణ్ గుర్తించకపోతే వచ్చే నష్టమేమీ లేదని అంబటి రాంబాబు అన్నారు.

news18-telugu
Updated: December 5, 2019, 4:37 PM IST
పేరు నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్... ఎలాగో చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే
పవన్ కళ్యాణ్
  • Share this:
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తనదైన స్టయిల్లో సెటైర్లు వేశారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల నుంచి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పేరు నిలబెట్టుకున్నారని... పవన్ అంటే గాలి అని... ఇప్పుడాయన గాలి మాటలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటే... ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందన్న అంబటి... పవన్ కళ్యాణ్ ఏమీ లేని ఆకు లాంటి వారని సెటైర్ వేశారు. పవన్ కళ్యాణ్ తుపాకి రాముడిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

Pawan kalyan, Ambati rambabu, ap news, ap politics, tdp, ysrcp, janasena, పవన్ కళ్యాణ్, అంబటి రాంబాబు, ఏపీ న్యూస్, టీడీపీ, వైసీపీ, జనసేన
పవన్ కల్యాణ్,అంబటి రాంబాబు (File Photos)


50 శాతం మంది ప్రజలు సీఎం జగన్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని... ఒక్క పవన్ కళ్యాణ్ గుర్తించకపోతే వచ్చే నష్టమేమీ లేదని అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే తాము అధికారంలోకి వచ్చేవాళ్లం కాదని పవన్ కళ్యాణ్ అనడాన్ని అంబటి రాంబాబు తప్పుబట్టారు. ఈ ముగ్గురు కలిసి పోటీ చేసి ఉంటే... ముగ్గురిని కలిపి జనం కట్టగట్టి బయటపడేసేవారని అన్నారు. నేను లేస్తే మనిషిని కాదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మతం గురించి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలను అంబటి తప్పుబట్టారు.
First published: December 5, 2019, 4:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading