ఇమ్రాన్ ఖాన్ తరహాలో చంద్రబాబు... వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు

చంద్రబాబు నివాసం ఉంటున్నది అక్రమ కట్టడమని, నది ప్రవాహంలో ఉందని సీఎం జగన్ ఎప్పుడో చెప్పారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గుర్తు చేశారు.

news18-telugu
Updated: August 17, 2019, 1:46 PM IST
ఇమ్రాన్ ఖాన్ తరహాలో చంద్రబాబు... వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు
చంద్రబాబు (File)
  • Share this:
చంద్రబాబు నివాసం అక్రమ కట్టడమని చెబితే ఆయనకు పట్టరానంత కోపం వస్తోందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. 370 రద్దుతో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వచ్చినంత కోపం చంద్రబాబుకు వస్తోందని తనదైన శైలిలో సెటైర్లు వేశారు. కృష్ణా నదిలో ఈ స్థాయి వరద అరుదు అని వ్యాఖ్యానించిన అంబటి... ప్రజలు ప్రాజెక్టుల దగ్గరికి వెళ్లి కృష్ణా ప్రవాహం చూసి ఆనందిస్తున్నారని అన్నారు. అయితే కృష్ణా నదికి వరద తన కొంప ముంచడానికే వచ్చిందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారని ఆరోపించారు. హై సెక్యురిటి జోన్ లో ఉన్న చంద్రబాబు ప్రమాదకరమైన ఇంట్లో ఎందుకు వుంటున్నారని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

చంద్రబాబు నివాసం ఉంటున్నది అక్రమ కట్టడమని, నది ప్రవాహంలో ఉందని సీఎం జగన్ ఎప్పుడో చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో తనది తప్పని తెలిసి కూడా చంద్రబాబు మొండిగా అక్కడే వుంటున్నారని ఆరోపించారు. అయినా రాజకీయంగా చంద్రబాబు కొంప ఎప్పుడో మునిగిపోయిందని...నీచమైన ప్రచారాల వల్లే ప్రజలు మిమ్మల్ని ఛీ కొట్టారని వ్యాఖ్యానించారు. ఇంటి విషయంలో తప్పు చేస్తూ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అనేక తప్పులు చేస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. నోటీస్ ఇచ్చేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిని కూడా ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తప్పును సరిదిద్దుకోకపోతే ప్రకృతి ప్రకోపానికి గురి అవుతారని అంబటి రాంబాబు హెచ్చింరు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు అమరావతిలో సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేదని ప్రశ్నించారు.


First published: August 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు