కోడెలపై చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే కొత్త సవాల్...

కోడెల, చంద్రబాబు

ఓటమి చెందిన తర్వాత కోడెల పట్ల చంద్రబాబు అనుసరించిన దుర్మార్గ వైఖరే ఆయన ఆత్మహత్యకు కారణమని అంబటి రాంబాబు ఆరోపించారు.

  • Share this:
    ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు జయంతి సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చంద్రబాబుకు సరికొత్త సవాల్ విసిరారు. వెన్నుపోటు పొడవడం, దండేసి పొగడటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించిన అంబటి రాంబాబు... ఇంతకీ కోడెల శివప్రసాద్ సెల్‌ఫోన్ ఏమైనట్టు అని ప్రశ్నించారు. ఫార్మాట్ చేయకుండా దాన్ని బయటపెట్టగలరా ? అని ట్విట్ ద్వారా వ్యాఖ్యానించారు. కోడెల జయంతిని పురస్కరించుకుని ఆయన ఆత్మహత్యను వైసీపీ మీదకు నెట్టాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు చూస్తున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు.    ఆరుసార్లు శాసనసభకు ఎన్నికై... అనేక పదవులు నిర్వహించిన అరుదైన నాయకుడు కోడెల శివప్రసాద్‌రావు అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఓటమి చెందిన తర్వాత కోడెల పట్ల చంద్రబాబు అనుసరించిన దుర్మార్గ వైఖరే ఆయన ఆత్మహత్యకు కారణమని అంబటి రాంబాబు ఆరోపించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: