కోడెల శవంతో చంద్రబాబు సిగ్గుమాలిన రాజకీయం.. వైసీపీ సంచలన ఆరోపణలు..

కోడెల ఆత్మహత్య ఘటనపై విచారణకు ఆదేశించాలని కోరుతూ గవర్నర్‌ను కలవాలన్న చంద్రబాబు నిర్ణయంపై వైసీపీ మండిపడింది. ఏ ముఖం పెట్టుకొని గవర్నర్ వద్దకు వెళ్తారని ఎద్దేవా చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

news18-telugu
Updated: September 19, 2019, 11:59 AM IST
కోడెల శవంతో చంద్రబాబు సిగ్గుమాలిన రాజకీయం.. వైసీపీ సంచలన ఆరోపణలు..
అంబటి రాంబాబు (File)
  • Share this:
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై విచారణకు ఆదేశించాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలోని బృందం ఈ రోజు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలవనుంది. కోడెల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను గవర్నర్‌కు చంద్రబాబు వివరిస్తారని సమాచారం. అయితే.. గవర్నర్‌ను కలవాలన్న చంద్రబాబు నిర్ణయంపై వైసీపీ మండిపడింది. ఏ ముఖం పెట్టుకొని గవర్నర్ వద్దకు వెళ్తారని ఎద్దేవా చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. బాబుది సిగ్గుమాలిన రాజకీయం అంటూ పరుష పదజాలం ఉపయోగిస్తూ.. పలు ప్రశ్నలను సంధించారు.

‘గత మూడునెలలుగా మీరు కోడెలను దగ్గరకు రానిచ్చారా?, కోడెల ఆత్మహత్యకు ప్రయత్నించారన్న వార్తలు విని ఆయన్ని పరామర్శించడానికి వెళ్లారా?, అసెంబ్లీ నుంచి కోడెల కోట్ల రూపాయల ఫర్నిచర్‌ తరలించడం మీకు తెలిసి జరిగిందా? తెలియకుండా జరిగిందా?, కోడెల ఫర్నిచర్‌ వ్యవహారంలో, ఆయన అరాచకాలకు గురై తట్టుకోలేక ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తే మీరు ఎందుకు నోరెత్తలేదు?, గత ఐదేళ్లుగా కోడెల కొడుకు, కూతురు కే-ట్యాక్స్‌ వసూలు చేశారా? లేదా?, కోడెల శవాన్ని అడ్డుపెట్టుకుని నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆస్పత్రిపై దాడికి మీరే పురిగొల్పారు. మరీ దిగజారిపోయి మూడు రోజుల పాటు శవం పక్కనే ఉండి మీ పార్టీని బతికించుకునేందుకు సిగ్గుమాలిన రాజకీయం చేశారు.’ అంటూ మొత్తం 21 ప్రశ్నలను చంద్రబాబుకు అంబటి సంధించారు. వీటిపై ప్రజలకు సమాధానం చెప్పి అప్పుడు గవర్నర్‌ దగ్గరకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు.
First published: September 19, 2019, 11:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading