‘జగన్‌ను దున్న అంటారా.. మీరే... ’ చంద్రబాబుపై వైసీపీ ఎటాక్

పాలిచ్చే ఆవు లాంటి టీడీపీని కాదని తన్నే దున్నపోతును (పరోక్షంగా వైసీపీ)ని తెచ్చుకున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి.

news18-telugu
Updated: August 10, 2019, 1:50 PM IST
‘జగన్‌ను దున్న అంటారా.. మీరే... ’ చంద్రబాబుపై వైసీపీ ఎటాక్
చంద్రబాబు, జగన్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎదురుదాడి చేసింది. ‘పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నని తెచ్చుకున్నారని చంద్రబాబు అనడం సరికాదు. తన వాళ్లకు పాలిచ్చి ప్రజలను మాత్రం జలగ లాగ పీడించారు చంద్రబాబు.’ అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. విజయవాడ సమీపంలోని తాడేపల్లి వద్ద నిర్మించిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబునాయుడుకు అధికారం లేక ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోతున్నారని అన్నారు. చంద్రబాబు తమ మీద విమర్శలు చేస్తే వాటికి తాము బదులిస్తున్నామే కానీ, ఆయనపై వ్యక్తిగతంగా దూషించడం లేదని అంబటి రాంబాబు చెప్పారు. వైసీపీ పాలన మీద బురదజల్లే ప్రయత్నం చేస్తోందని టీడీపీ మీద మండిపడ్డారు. కానీ, అవినీతిరహిత పాలన అందించాలనే భావనతో ముందుకు వెళ్తున్నామన్నారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది. ఆ పార్టీకి 151 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి కేవలం 23 సీట్లే దక్కాయి. దీనికి సంబంధించి చంద్రబాబు... పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ... పాలిచ్చే ఆవు లాంటి టీడీపీని కాదని తన్నే దున్నపోతును (పరోక్షంగా వైసీపీ)ని తెచ్చుకున్నారని వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి.

First published: August 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు