ఎన్టీఆర్‌పై జాలి, కరుణ ఏమయ్యాయి ? భువనేశ్వరికి వైసీపీ ప్రశ్న

నారా భువనేశ్వరి(ఫైల్ ఫోటో)

రాజధాని రైతుల చంద్రబాబు మాయలో పడొద్దని అంబటి అన్నారు. చంద్రబాబు హత్యలు చేసి ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రచారం చేయొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

  • Share this:
    అమరావతి రైతుల పట్ల చంద్రబాబు భార్య భువనేశ్వరి జాలి చూపిస్తున్నట్టు నటించారని వైసీపీ ఆరోపించింది. అమరావతి రైతుల పట్ల ఇంత జాలి చూపించిన భువనేశ్వరికి గోదావరి పుష్కరాల్లో చనిపోయిన 30 మందిపై జాలి కలగలేదా ? అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు కారణంగా వెన్నుపోటుగా గురై మానసిక క్షోభకు గురైనప్పుడు ఎన్టీఆర్‌పై ఆమెకు ఎందుకు జాలి కలగలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఆమె జాలి మనసు ఏమైందన్నారు. అమరావతి రైతులపై భువనేశ్వరికి జాలి లేదని... తన భర్త, కుమారుడు కొనుగోలు చేసిన భూములు ఏమైపోతాయో అని ఆమె ఆందోళన చెందుతున్నారని అంబటి విమర్శించారు.

    రాజధాని రైతుల చంద్రబాబు మాయలో పడొద్దని అంబటి అన్నారు. చంద్రబాబు హత్యలు చేసి ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రచారం చేయొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇతర కారణాల వల్ల చనిపోయినా... రాజధాని కోసం చనిపోయారని చెప్పొచ్చని ఆరోపించారు. అమరావతి ప్రకటనకు ముందే పెద్ద ఎత్తున భూముల కొనుగోలు చేశారని విమర్శించారు. రాజధాని ప్రకటనకు ముందే చంద్రబాబు తన బినామీలతో భూములు కొనిపించారని మండిపడ్డారు. అమరావతిలో ఏదో జరుగుతోందని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని... రాజధాని పేరుతో అనేక అక్రమాలు జరిగాయని ఆయన అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: