చంద్రబాబు జేబులో మనిషి... కన్నాకు వైసీపీ కౌంటర్

వందల కోట్లు సంపాదించుకోడానికి రాజకీయ అవినీతి చేయలేదని.. చంద్రబాబుకు అమ్ముడుపోలేదని కన్నా ప్రమాణం చేయాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు.

news18-telugu
Updated: April 21, 2020, 6:47 PM IST
చంద్రబాబు జేబులో మనిషి... కన్నాకు వైసీపీ కౌంటర్
కన్నా లక్ష్మీనారాయణ(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబు జేబులో మనిషి అని వైసీపీ విమర్శించింది. వందల కోట్లు సంపాదించుకోడానికి రాజకీయ అవినీతి చేయలేదని.. చంద్రబాబుకు అమ్ముడుపోలేదని కన్నా ప్రమాణం చేయాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి చేరిన కన్నా... తమపై ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. బీజేపీలో అధ్యక్షుడిగా ఇవ్వడం లేదని వైసీపీలోకి కన్నా చేరాలనుకోలేదా అని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబుకు రూ.20 కోట్లకు అమ్ముడు పోయి ఇప్పుడు మాపై విమర్శలా చేస్తారా అని విమర్శించారు.

చంద్రబాబు జేబులో మనిషి... కన్నాకు వైసీపీ కౌంటర్ | Ysrcp mla Ambati rambabu counter to ap bjp president kanna Lakshmi Narayana ak
అంబటి రాంబాబు


రూ. 20 కోట్లు ఇచ్చి కాంగ్రెస్‌లో సీఎం పదవి కొనుక్కోవాలని ప్రయత్నించలేదా? అని ప్రశ్నించారు. బీజేపీ ఎన్నికల ఫండ్‌ను కన్నా కొట్టేశారో లేదో చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. కేంద్రం కొనుగోలు చేసిన ధర కంటే తక్కువకే ర్యాపిడ్‌ కిట్లు కొనుగోలు చేశామని అంబటి రాంబాబు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం కూడా 790కే కొనుగోలు చేసిందని.. వాటిని కన్నా లక్ష్మీ నారాయణ ఎందుకు ప్రశ్నించడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కరోనాపై కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయని.. నియంత్రణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని అన్నారు.
First published: April 21, 2020, 6:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading