శాసన మండలి అవసరమా..? అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు

తాము డోర్లు తెరిస్తే టీడీపీ ఎమ్మెల్సీలంతా వైసీపీలోకి క్యూ కడతారని.. కానీ అది తమ విధానం కాదని చెప్పుకొచ్చారు రాంబాబు.


Updated: January 23, 2020, 3:01 PM IST
శాసన మండలి అవసరమా..? అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు
అంబటి రాంబాబు
  • Share this:
ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించడంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఏపీ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్‌పై వైసీపీ నేతలు, మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభావంతోనే బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించారని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. మండలిలో జరిగిన పరిణామాలు ప్రజస్వామానికి ఆందోళన కలిగిస్తున్నాయని.. చాలా రాష్ట్రాల్లో మండలి లేదని ఆయన తెలిపారు. మండలిలో మెజార్టీ ఉంటే బిల్లులను తిరిగి పంపవచ్చని.. కానీ అలా కాకుండా బిల్లులను అడ్డుకున్నారని టీడీపీపై విమర్శలు గుప్పించారు అంబటి రాంబాబు. బిల్లులను తాత్కాలికంగా మాత్రమే అడ్డుకోగలరని, శాశ్వతంగా అడ్డుకోలేరని స్పష్టం చేశారు. బిల్లును అడ్డుకోవడం ద్వారా రాజధాని వైజాగ్‌కు వెళ్లకుండా ఆపగలరా.. అని ఆయన ప్రశ్నించారు.


చట్ట సభల్లో దుష్ట సంప్రదాయానికి టీడీపీ తెరలేపిందని విమర్శలు గుప్పించారు అంబటి రాంబాబు. మండలిలో జరిగిన తీరును ప్రజలు ఆలోచించాలని.. శాసన మండలి అవసరమా అనే చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పానని చెప్పే చంద్రబాబు మండలి గ్యాలరీలో చైర్మన్‌కు ఎదురుగా ఎందుకు కూర్చున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు తీరును ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు. తాము డోర్లు తెరిస్తే టీడీపీ ఎమ్మెల్సీలంతా వైసీపీలోకి క్యూ కడతారని.. కానీ అది తమ విధానం కాదని చెప్పుకొచ్చారు రాంబాబు. అమరావతి భూముల విషయలో జరగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరుగుతోందని.. తప్పు చేసిన వారికి శిక్షతప్పదని స్పష్టం చేశారు.
First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు