దమ్ముంటే ఆ పని చేయండి.. టీడీపీకి వైసీపీ ఎమ్మెల్యే సవాల్

ఐటీ శాఖ ఇచ్చిన ప్రకటనలో నిజం లేదని చెబుతున్న టీడీపీ నేతలు.. దమ్ముంటే ఐటీశాఖపై పరువు నష్టం దావా వేయాలని సవాల్ విసిరారు.

news18-telugu
Updated: February 17, 2020, 8:35 PM IST
దమ్ముంటే ఆ పని చేయండి.. టీడీపీకి వైసీపీ ఎమ్మెల్యే సవాల్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో ఐటీ సోదాల విషయంలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా టీడీపీపై గుడివాడ ఎమ్మెల్యే అమర్‌నాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. తన మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఐటీశాఖ జరిపిన సోదాలపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.2వేల కోట్ల అవినీతి జరిగిందని ఆదాయ పన్నుశాఖ (ఐటీశాఖ) ప్రకటించినా చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని విరుచుకుపడ్డారు అమర్‌నాథ్. ఐటీ శాఖ ఇచ్చిన ప్రకటనలో నిజం లేదని చెబుతున్న టీడీపీ నేతలు.. దమ్ముంటే ఐటీశాఖపై పరువు నష్టం దావా వేయాలని సవాల్ విసిరారు. బినామీ ఆస్తుల గుట్టు బయటపడుతుందనే భయం ఆయనకు పట్టుకుందని ధ్వజమెత్తారు.

''రూ.2వేల కోట్ల అవినీతి జరిగిందని ఐటీశాఖ ప్రకటనలో స్పష్టంగా ఉంది. చంద్రబాబు నాయుడు బినామీ సంస్థలు సృష్టించి నిధులను మళ్లించారు. టీడీపీ నేతలకు మాత్రం అవేమీ కనిపించడం లేదు. టీడీపీ నేతలు ఒకవేళ మాపై పరువు నష్టం దావా వేస్తే.. గతంలో జగన్‌పై వ్యాఖ్యలు చేసినందుకు మేమూ పరువు నష్టం దావా వేస్తాం. చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణకు వైసీపీ నేతలు సిద్ధమా?'' అని అమర్‌నాథ్ విమర్శించారు.

First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు