అమరావతిలో అలా చేస్తే తప్పేంటి ?... వైసీపీ ఎమ్మెల్యే సూటి ప్రశ్న

రాజధానిలోకి పేదలెవ్వరూ రానివ్వకూడదని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.


Updated: February 26, 2020, 4:14 PM IST
అమరావతిలో అలా చేస్తే తప్పేంటి ?... వైసీపీ ఎమ్మెల్యే సూటి ప్రశ్న
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు, టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. అమరావతి ప్రాంతంలో మొత్తం 54 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు బాధేంటని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ నిర్ణయంతో అమరావతి ఇకపై బహుజన అమరావతిగా, సర్వజన అమరావతిగా మారనుందని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. అరలక్షకు పైగా కుటుంబాలకు రెండు లక్షల ప్రజలకు అమరావతి కొత్తగా ఆశ్రయం కల్పించనుందని అన్నారు. అమరావతిలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఇతర కులాల్లో నిరుపేదలకు సంబంధించి 54 వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించనున్నామని అన్నారు.

alla rama krishna reddy,complaint on alla rk,alla rk news,mangalagiri mla rk,మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే,ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఫిర్యాదు,అమరావతి రైతుల ధర్నా,రైతులపై ఆళ్ల కామెంట్స్
ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే


రాజధానిలోకి పేదలెవ్వరూ రానివ్వకూడదని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాజధానిలో చంద్రబాబు లాంటి గొప్పవాళ్లే ఉండాలా ? అని ప్రశ్నించారు. అమరావతి అందరి రాజధానిగా మారబోతోందని... రాజధాని విషయంలో చంద్రబాబు అన్యాయంగా మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు తాను చేసిన వాగ్దానాలను విస్మరించారని అన్నారు.100 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చంద్రబాబు అన్నారు. రాష్ర్టంలో ఎక్కడా బలవంతంగా భూసేకరణ జరగడం లేదని తెలిపారు.First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు