కొత్తగా కట్టిన టీడీపీ ఆఫీస్ కూల్చేయాలని హైకోర్టులో పిటిషన్

కొత్తగా నిర్మించిన టీడీపీ కొత్త కార్యాలయం అక్రమ నిర్మాణమంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

news18-telugu
Updated: December 6, 2019, 3:14 PM IST
కొత్తగా కట్టిన టీడీపీ ఆఫీస్ కూల్చేయాలని హైకోర్టులో పిటిషన్
గుంటూరులో ప్రారంభమైన టీడీపీ కొత్త ఆఫీసు
  • Share this:
గుంటూరు జిల్లా ఆత్మకూరులో నిర్మితమైన టీడీపీ నూతన కార్యాలయ నిర్మాణం అక్రమమని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ కార్యాలయాన్ని కూల్చివేసి, ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆత్మకూరు పరిధిలో ఉన్న వాగు పోరంబోకుకు చెందిన సర్వే నెంబరు 392లో 3.65 ఎకరాల భూమిని టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం 99 సంవత్సరాల పాటు లీజుకిస్తూ 2017లో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని పిటిషన్‌లో పేర్కొన్న ఆళ్ల... ఇది అక్రమమని అన్నారు. దీనిపై సోమవారం విచారణ జరిగే ఉందని తెలుస్తోంది.

వాగులు, వంకలు, చెరువులు, నదీ పరివాహక ప్రాంతాల భూముల్ని ఇతరాలకు కేటాయించడం పర్యావరణ చట్టాలకు విరుద్ధమని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని ఎమ్మెల్యే ఆళ్ల తన పిటిషన్‌లో వివరించారు. ఈ వ్యవహారంలో అనేక చట్ట ఉల్లంఘనలు ఉన్నందున గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయడంతో పాటు అక్రమంగా కట్టిన టీడీపీ భవనాన్ని కూల్చివేసి, తిరిగి ఆ భూమిని స్వాధీనం చేసుకునేలా అధికారులను ఆదేశించాలని హైకోర్టును కోరారు.

Tdp new office, Guntur, chandrababu, lokesh, alla Ramakrishna reddy, high court
వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి


ఇదిలా ఉంటే గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం అత్మకూరు పరిధిలో టీడీపీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ సతీసమేతంగా పాల్గొన్నారు. కార్యాలయం ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు చేపట్టి పార్టీ జెండాను చంద్రబాబు ఎగురవేశారు.


First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>