‘మంగళగిరిలో చంద్రబాబు కూడా గెలవలేరు’

గ్రామస్థాయినేతగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆళ్ల ఆరోపించారు. ఆయన రోజురోజుకు దిగజారి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: February 6, 2020, 12:02 PM IST
‘మంగళగిరిలో చంద్రబాబు కూడా గెలవలేరు’
చంద్రబాబు
  • Share this:
రైతు మిత్ర అని చెప్పుకునే చంద్రబాబు మంగళగిరిలో ఎందుకు పోటీ చేయలేదని వైసీసీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. సిఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు తన పవర్ ను ఉపయోగించినా మంగళగిరిలో వార్డును గెలిపించుకోలేకపోయారని ఆరోపించారు. చంద్రబాబు మంగళగిరి నుంచి పోటీచేస్తే ఆయన కూడా ఓడిపోయి ఉండేవారని ఎమ్మెల్యే ఆళ్ల విమర్శించారు. సీఎం జగన్ తో రైతులు కలసి తమ సమస్యలు చెబితే వాటిపై కూడా విమర్శలా చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. జగన్ తప్పకుండా రైతులకు న్యాయం చేస్తారని అన్నారు. ఏమీ తెలుసుకోకుండానే చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

గ్రామస్థాయినేతగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆళ్ల ఆరోపించారు. ఆయన రోజురోజుకు దిగజారి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అమరావతి రైతులు ఎవరూ సహకరించలేదని ఎమ్మెల్యే ఆళ్ల అన్నారు. పూలింగ్ అని చెప్పి చంద్రబాబు బలవంతపు భూసేకరణకు దిగారని ఆరోపించారు. సీఎం జగన్‌ను కలిసిన రైతులను పెయిడ్ ఆర్డిస్ట్ లని అనడం సరికాదని ఆళ్ల వ్యాఖ్యానించారు. తాము రాజధాని రైతులకు అండగా మేం ఉంటామని... ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి అందరి జాతకాలు బయటపడతాయని అన్నారు. అధికారులను,పోలీసులను కూడా చంద్రబాబు బెదిరిస్తున్నారని ఆళ్ల మండిపడ్డారు.
First published: February 6, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు